|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mega 157 : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వచ్చేసింది.. మెగా 157 టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. మెగాస్టార్ లుక్స్ అదుర్స్..

Published: 22-08-2025, 2:21 AM
Mega 157 : చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వచ్చేసింది.. మెగా 157 టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. మెగాస్టార్ లుక్స్ అదుర్స్..

మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి చేస్తున్న ‘మెగా 157’ సినిమా టైటిల్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రకటించబడింది. ‘మన శంకర’ అనే టైటిల్ తో గ్లింప్స్ విడుదలైంది.

Key Points

1

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా టైటిల్ లాంచ్!

2

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ విడుదల.

4

2026 సంక్రాంతికి సినిమా విడుదలకు సిద్ధం.

మెగా 157 టైటిల్ అనౌన్స్‌మెంట్

Mega 157 : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, చిరు కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.(Mega 157)

చిరంజీవి లుక్స్ అదుర్స్!

2026 సంక్రాంతి రిలీజ్

చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ కామెడీ జానర్లో ఈ సినిమా ఉండనుంది. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో దిగనుంది. తాజాగా నేడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ముందు నుంచి రూమర్స్ ఉన్నట్టే ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఈ గ్లింప్స్ లో చిరంజీవి లుక్స్ అదిరిపోయాయి. గ్లింప్స్ చూస్తుంటే పక్కా కమర్షియల్ హిట్ సినిమా అని తెలుస్తుంది.

చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘మన శంకర’ టైటిల్ తో 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.