|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా 158: చిరు బాబీ ఊర మాస్ కాంబో! బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో మెగా విధ్వంసం ఖాయం!

Published: 29-05-2026, 5:45 PM
మెగా 158: చిరు బాబీ ఊర మాస్ కాంబో! బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో మెగా విధ్వంసం ఖాయం!
  • మెగా 158 షూటింగ్ ప్రారంభం, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్.
  • బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో చిరు స్టైల్, పక్కా ఆంధ్ర యాస డైలాగులు హైలైట్.
  • మాస్, ఎమోషన్, కామెడీ కలగలిసిన మెగాస్టార్ పాత్ర చిత్రీకరణ.
  • వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ-చిరు కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో వస్తున్న ‘మెగా 158’ సినిమాపై రోజుకో సంచలన వార్త బయటకొస్తుంది. తాజాగా ఈ సినిమా కథా నేపథ్యం గురించి లీకైన వివరాలు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. అసలు చిరు ఏం చేయబోతున్నారో చూద్దాం రండి!

చిరు-బాబీ కాంబోలో మరో సంచలనం!

Mega 158 : ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా 158 సినిమా ఇటీవలే ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయింది.

బెంగాల్ గడ్డపై మెగాస్టార్ దండయాత్ర!

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ సినిమా కథ అంతా బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌ లో సాగుతుందని తెలుస్తోంది. కానీ మెగాస్టార్ పాత్ర మాత్రం పూర్తిగా ఆంధ్ర రూట్స్‌తో ఉంటుందట. ఆయన డైలాగ్ డెలివరీలో పక్కా ఆంధ్ర యాస వినిపించేలా బాబీ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాడని టాక్. ఆంద్ర నుంచి వెళ్లి బెంగాల్‌లో ఆంధ్ర వ్యక్తి ఎలా డామినేట్ చేసాడు, అతని బ్యాక్‌స్టోరీ ఎలా ఉంటుందో అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని టాక్‌.

ఊర మాస్ యాక్షన్.. ఎమోషనల్ రైడ్!

ఇక ఈ సినిమాలో చిరంజీవి మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌, చిరు మార్క్ కామెడీ కూడా ఉంటాయని సమాచారం. వాల్తేరు వీరయ్య లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ నారాయణ నిర్మిస్తుండగా ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుంది.

‘మెగా 158’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో చిరు చేసే విధ్వంసం చూడాలంటే వేచి చూడాల్సిందే. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.