|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డైరెక్టర్ సొంత ఊర్లో రియల్ ఇన్సిడెంట్లతో సినిమా.. ఇవాళ ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’.. యువకుడి శరీరంలోకి యువతి ఆత్మ

Published: 08-09-2025, 8:14 PM
డైరెక్టర్ సొంత ఊర్లో రియల్ ఇన్సిడెంట్లతో సినిమా.. ఇవాళ ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’.. యువకుడి శరీరంలోకి యువతి ఆత్మ

బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కన్నడ హారర్-కామెడీ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ ఇప్పుడు ఓటీటీలో విడుదల అయింది. డైరెక్టర్ తన సొంత ఊరిలో జరిగిన నిజ సంఘటనల నుండి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Key Points

1

కన్నడ హారర్-కామెడీ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ ఓటీటీలోకి!

2

డైరెక్టర్ సొంత ఊరిలోని నిజ సంఘటనల ఆధారంగా చిత్రం నిర్మాణం.

4

యువకుడి శరీరంలో యువతి ఆత్మ ప్రవేశించడం కథాంశం.

‘సు ఫ్రమ్ సో’ ఓటీటీ విడుదల

బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కన్నడ హారర్-కామెడీ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ (Su From So) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 9) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ సొంత ఊర్లో జరిగిన వాస్తవ సంఘటల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించారు.

సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కన్నడలో రిలీజై అదరగొట్టిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం జియోహాట్‌స్టార్ లో ఇది అడుగుపెట్టింది. కన్నడతో పాటు తెలుగు, మలయాళంలో ఈ మూవీ చూసేందుకు అందుబాటులో ఉంది. కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీని మలయాళం, తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

నిజ సంఘటనల ఆధారంగా సినిమా

పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సు ఫ్రమ్ సో థియేటర్లలో మొదటి రోజు రూ. 78 లక్షలతో నిరాడంబరంగా ప్రారంభమైంది. కానీ త్వరగా మౌత్-టాక్ ద్వారా సంచలనంగా మారింది. కేవలం రెండు వారాల్లో భారతదేశంలో రూ. 43 కోట్ల నికర వసూళ్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది, ఇటీవలి కాలంలో అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇలాంటి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నిజానికి సెప్టెంబర్ 5నే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవుతుందనే వార్తలొచ్చాయి. కానీ ఈ రోజు ఓటీటీ లో రిలీజైంది.

సు ఫ్రమ్ సో బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ కథ చాలా సింపుల్. ఓ గ్రామంలో మంచి జోష్ మీద ఉంటే ఓ యువకుడికి దెయ్యం పట్టిందని అందరూ అనుమానిస్తారు. ఆ యువకుడిని అమ్మాయి ఆత్మ ఆవహించిందని నమ్ముతారు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ దెయ్యాన్ని ఎలా వదలగొట్టారు? నిజంగానే ఆ యువకుడిలో ఆత్మ ప్రవేశించిందా? అన్నది సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చింది.

బాక్స్ ఆఫీస్ విజయం

సు ఫ్రమ్ సో సినిమాకు జేపీ తుమినాడ్ డైరెక్టర్. ఆయనే లీడ్ రోల్ కూడా ప్లే చేశాడు. ఆయన గ్రామంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫైనల్ స్క్రిప్ట్‌కు చేరే ముందు 26 సార్లు కథను రీ రైట్ చేశారని తెలిసింది. లైట్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజ్ బి. శెట్టి నిర్మించిన ఈ చిత్రం మలయాళం, తెలుగులోకి డబ్ అయింది. రాజ్ బి.శెట్టి కూడా నటించారు.

‘సు ఫ్రమ్ సో’ సినిమా ఓటీటీ విడుదలతో, సినిమా ప్రేమికులు ఇంటి వద్దనే ఈ ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్‌ను ఆస్వాదించవచ్చు. బాక్స్ ఆఫీస్ హిట్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.