|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘మెగా-158’ లో హీరోయిన్ ఫిక్స్.. మెగాస్టార్ సరసన బంపర్ ఆఫర్ అందుకున్న మలయాళ బ్యూటీ..

Published: 15-10-2025, 12:10 AM
‘మెగా-158’ లో హీరోయిన్ ఫిక్స్.. మెగాస్టార్ సరసన బంపర్ ఆఫర్ అందుకున్న మలయాళ బ్యూటీ..

మలయాళ అందాల తార మాళవిక మోహనన్ మెగాస్టార్ చిరంజీవి ‘మెగా-158’ చిత్రంలో హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ తర్వాత ఆమెకు ఈ బంపర్ ఆఫర్ దక్కడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Key Points

1

మాళవిక మోహనన్ 'ది రాజా సాబ్' సహా బిజీగా ఉంది.

2

చిరంజీవి 'మెగా-158'లో మాళవిక హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం.

4

మాళవిక నిర్ణయంపై నెటిజన్ల నుండి రకరకాల స్పందనలు.

మాళవిక మోహనన్ కొత్త ప్రాజెక్ట్‌లు

మలయాళ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌తో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమారి, సంజయ్ దత్, యోగిబాబు, మాళవిక, నిధి అగర్వాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, మాళవిక మోహనన్ ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

‘మెగా-158’ లో హీరోయిన్‌గా ఫిక్స్

మాళవిక మెగాస్టార్ సరసన నటించబోతున్నట్లు టాక్. బాబీ(Bobby), చిరంజీవి(Chiranjeevi) కాంబోలో వస్తున్న ‘మెగా-158’(Mega-158) సినిమాలో మాళవిక హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఈ భామకు మూవీ మేకర్స్ సంప్రదించగా.. ఆమె నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా మెగా స్టార్ సరసన కావడంతో వెంటనే ఒకే చేసిందట. ఇక మాళవిక 70 ఏళ్ల హీరోతో నటించేందుకు ఒప్పుకోవడం నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అవసరమా నీ ఏజ్‌కి తగ్గ హీరోలతో నటించమని సలహా ఇస్తున్నారు. మరికొందరు బంపర్ ఆఫర్ పట్టేసిందని అంటున్నారు.

మెగాస్టార్-మాళవిక కాంబోపై నెటిజన్ల రియాక్షన్

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

మాళవిక మోహనన్ ‘మెగా-158’లో చిరంజీవి సరసన నటించడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ వార్త ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్‌గా మారనుంది. ఈ కాంబో పట్ల ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.