
📌 Key Points
- సరిగమప వరుణవిని ప్రత్యేకంగా కలిసిన మెగాస్టార్ చిరంజీవి.
- ‘మీసాలపిల్ల’ పాటతో చిరు మామను మెప్పించిన వరుణవి.
- వరుణవి అల్లరి మాటలు, ‘రికార్డు’ డైలాగ్‌కు చిరంజీవి ఫిదా.
- భవిష్యత్తులో అండగా ఉంటానని వరుణవికి చిరంజీవి హామీ.
మెగాస్టార్ చిరంజీవి ఎంతటి గొప్ప మనసున్న మనిషో మరోసారి నిరూపితమైంది! సరిగమప వరుణవితో ఆయన భేటీ, వారి సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అద్భుతమైన ప్రోమో సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
వరుణవి పాటకు చిరు మామ ఫిదా!
సరిగమప సింగింగ్ కాంపిటేషన్ షో చూసే వారికి, సోషల్ మీడియాలో జీ తెలుగును ఫాలో అయ్యే వారికి వరుణవి అంటే ఎవరో బాగా తెలుసు. చూపులేకపోయినా.. ఆ చిన్నారికి సంగీతంపై ఉన్న మక్కువకు జడ్జిలు ఫిదా అయ్యారు. ప్రస్తుతం రన్ అవుతున్న సరిగమప సీజన్ ఎండింగ్ వరకూ ఎలిమినేషన్ లేకుండా పాడే ఛాన్స్ ఇచ్చారు. ప్రతీ ఎపిసోడ్ లో వరుణవి పాటలు, ముద్దు ముద్దు మాటలకు జడ్జిలు అనిల్ రావిపూడి, శైలజ, అనంత్ శ్రీరామ్, యాంకర్ సుధీర్, ఇతర సింగర్లు, అక్కడున్న మిగతా ప్రేక్షకులంతా ఫిదా అవుతారు. తాజాగా రిలీజైన సరిగమప ప్రోమోలో వరుణవిని కలిసేందుకు చిరంజీవి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఆ చిన్నారితో ముచ్చటించడం, చిరు మామ అని వరుణవి పిలవడం.. ఎంతో చూడముచ్చటగా కనిపించాయి.
డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవిని కల్పిస్తానని మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే మెగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చిరంజీవిని కల్పించారు. వరుణవిని చూడగానే చిరంజీవి.. అచ్చం నెమలిలాగా ఉన్నావు అని ముద్దుచేశారు. ఒడిలో కూర్చో పెట్టుకుని సరదాగా మాట్లాడారు. మీసాలపిల్ల పాట పాడి వరుణవి చిరు మామను మెప్పించింది. ఆమెకున్న టాలెంట్ చూసి చిరంజీవి సైతం అబ్బురపోయారు. వరుణవికి భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని మాటిచ్చారు చిరంజీవి. రికార్డులో మీ సినిమా ఉండటం కాదు.. మీ సినిమాపై రికార్డు ఉంటుందని వరుణవి చెప్పిన డైలాగ్ కు నవ్వులు పూశాయి. ఈ పిల్ల చాలా అల్లరిది.. చాక్లెట్ ఇస్తాను తింటావా అంటూ వరుణవికి చాక్లెట్ ఇచ్చారు. ఇవేం తనకు అక్కర్లేదని, చిరుమామ బ్లెస్సింగ్ చాలని, దొండకాయ్ బెండకాయ్ చిరుమామ నా గుండెకాయ్ అంటూ వరుణవి చేసిన అల్లరి చూడముచ్చటగా అనిపించింది. మా చిరు అంటే అది.. ఆయన మంచితనం ఇలా ఉంటుందని ఈ ప్రోమోపై మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్‌ను మెప్పించిన ‘దొండకాయ్ బెండకాయ్’ డైలాగ్!
భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి!
వరుణవి, చిరంజీవిల అద్భుతమైన అనుబంధం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరూ మెగాస్టార్‌ను ప్రశంసిస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన సినీ వార్తలు, అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!


