
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి చిరంజీవిని అతిథిగా ఆహ్వానించారు.
- హైదరాబాద్‌ను ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్‌గా మార్చే సీఎం విజన్‌ను చిరు ప్రశంసించారు.
- సినిమా రంగం అభివృద్ధికి తన దిశా నిర్దేశం కోరడం ఆనందదాయకం అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్”కి ఆహ్వానించినందుకు, హైదరాబాద్‌ను ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే విజన్‌ను ప్రశంసిస్తూ చిరు ఈ ట్వీట్ చేశారు.
చిరంజీవి ట్వీట్ వెనుక కారణం
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ డైరెక్టర్ అనిల్ రావిపూడి(anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార(Nayanathara) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెంకటేష్(Venkatesh) దగ్గుబాటి కామియో రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఫ్యూచర్ సిటీలో మంగళవారం జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబట్ సమ్మిట్’ కార్యక్రమానికి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లారు.
సీఎం రేవంత్ రెడ్డి విజన్: ఫిల్మ్ హబ్ హైదరాబాద్
ఈ మేరకు నేడు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి(C.M Revanth Reddy)కి ధన్యవాదాలు తెలుపుతూ తన ఎక్స్‌లో ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డితో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ‘నిన్న ఫ్యూచర్ సిటీలో జరిగిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ C.M శ్రీ.రేవంత్ రెడ్డికి నా ధన్యవాదాలు. “తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ లో భాగంగా.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తూ.. హైదరాబాద్‌ను ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది.
గ్లోబల్ సమ్మిట్ లో చిరంజీవి పాత్ర
ఈ మహత్తర కార్యాచరణలో నా దిశా నిర్దేశం కోరడం.. నాకు ఎంతో ఆనందదాయకం.C.M రేవంత్ రెడ్డి గారి విజన్ అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో మన నుండి మరెన్నో “World Class Projects” రూపుదిద్దాలని, ప్రపంచ సినిమా హైదరాబాద్ పై దృష్టి సారిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి విజన్, ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్ నుండి మరిన్ని వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటాయని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది హైదరాబాద్‌ను ప్రపంచ సినీ పటంలో నిలుపుతుందని ఆయన విశ్వసించారు.


