|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెహర్ రమేష్ ఇంట తీరని విషాదం! డైరెక్టర్ కుటుంబంలో విషాద ఛాయలు..

Published: 06-02-2026, 11:05 PM
మెహర్ రమేష్ ఇంట తీరని విషాదం! డైరెక్టర్ కుటుంబంలో విషాద ఛాయలు..
  • డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
  • మెహర్ రమేష్ అత్తమ్మ పద్మావతి గారు మరణించారు.
  • సోషల్ మీడియా ద్వారా తన బాధను పంచుకున్న మెహర్ రమేష్.
  • సినీ ప్రముఖులు, అభిమానుల నుండి మెహర్ రమేష్‌కు సానుభూతి.

ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అత్తమ్మ పద్మావతి గారు కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా మెహర్ రమేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

మెహర్ రమేష్ ఇంట విషాదం

Meher Ramesh: చిత్ర పరిశ్రమలో జరిగే విషాదఛాయలు అభిమానులను, సెలబ్రిటీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం తెలిసిందే..కొంతమంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది యాక్సిడెంట్స్ లేదా వయసు మీద పడడం వల్ల స్వర్గస్తులవుతున్నారు. అంతేకాదు ఆ సెలబ్రిటీలకు సంబంధించిన బంధువుల మరణాలను కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.. ఒక స్టార్ డైరెక్టర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకోవడంతో అభిమానులు కూడా దుఃఖింతులవుతున్నారు.

ఆయన ఎవరో కాదు టాలీవుడ్ సినీ పరిశ్రమలో డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మెహర్ రమేష్ (Meher Ramesh).ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. ఆయన అత్తమ్మ పద్మావతి పరమపదించారు.. ఈ విషయాన్ని మెహర్ రమేష్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్ చేశారు. “ఇన్ని రోజులు మా అమ్మను మీలో చూసుకున్నాను. మా అత్తమ్మ పద్మావతి శివైక్యం పొందారు. మా అమ్మ వెంకటసుబ్బమ్మ గారు 2003 ఫిబ్రవరి 7న పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకి ఆఖరి వీడ్కోలు చెబుతున్నాను.. మా కుటుంబానికి ఇది తీరనిలోటు.. ఓం శాంతి” అంటూ అంటూ తన ఇంట్లో చోటు చేసుకున్న విషాదం గురించి అందరికీ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటు సినీ ప్రముఖులు, అభిమానులు మెహర్ రమేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు. ఆయన అత్తమ్మకు నివాళులు అర్పిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

మెహర్ రమేష్ విషయానికి వస్తే.. కన్నడలో బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించిన ఈయన.. తెలుగులో ఆంధ్రావాలా , ఒక్కడు వంటి సినిమాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కంత్రి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈయన ప్రభాస్ తో బిల్లా లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలు తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. శక్తి , షాడో, భోళాశంకర్ లాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. చివరిగా మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమా చేసిన మెహర్ రమేష్ ఈ సినిమా తర్వాత పెద్దగా కనిపించడం లేదు. ఇక మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువైన ఈయన అప్పుడప్పుడు మెగా హీరోల సినిమా ఈవెంట్లు , ఫంక్షన్లలో మాత్రం కనిపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఆయన కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయం నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

సినీ ప్రముఖుల సంతాపం

ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను మా అత్తమ్మ “పద్మావతి ” శివైక్యం పొందారు 🙏🏼 మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 7th ఫిబ్రవరి పరమపదించారు సరిగ్గా అదే తేదీ న అత్తమ్మ కి ఆఖరి వీడ్కోలు 💐 మా కుటుంబానికి తీరని లోటు ఓం శాంతి 🙏🏼 pic.twitter.com/0wj1xYOoh7

— Meher Raamesh (@MeherRamesh) February 6, 2026

మెహర్ రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆయన అత్తమ్మ పద్మావతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. ఈ కష్ట సమయంలో ఆయనకు మనోధైర్యం చేకూరాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.