|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినీ నటుడు ఫిష్ వెంకట్‌ని పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి.. లక్ష ఆర్థిక సాయం

Published: 06-07-2025, 11:24 PM
సినీ నటుడు ఫిష్ వెంకట్‌ని పరామర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి.. లక్ష ఆర్థిక సాయం

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సినీ నటుడు ఫిష్ వెంకట్‌ను పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖా మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఆయనకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు, అదనపు ప్రభుత్వ సహాయం కూడా అందించేందుకు హామీ ఇచ్చారు.

Key Points

1

మంత్రి వాకిటి శ్రీహరి ఫిష్ వెంకట్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు.

2

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్‌కు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.

4

సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి అదనపు ప్రభుత్వ సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు.

మంత్రి పరామర్శ

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గల ఆర్. బీ. ఎం హాస్పిటల్ లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్‌ని పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖా మంత్రి వాకిటి శ్రీహరి చేరుకుని ఫిష్ వెంకట్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వద్ద గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు. తక్షణ వైద్య ఖర్చుల కోసం కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రజలను అలరించిన నటుడు ఫిష్ వెంకట్ అని, తెలంగాణ యాసతో అలరించిన గొప్ప నటుడుని కొనియాడారు.

తెలుగు రాష్ట్రాల్లో అతన్ని గుర్తుపట్టనివాళ్లు ఉండరని, త్వరగా కోలుకుని తిరిగి నటన కొనసాగించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. సినిమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ పరంగా అందుకుంటామని హామీ ఇచ్చారు. వెంకట్ ఆరోగ్య పరిస్థితిని సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మినిస్టర్‌తో పాటు స్పోర్ట్స్ చైర్మన్ శివ సేన, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రితం తదితరులు పాల్గొన్నారు.

లక్ష రూపాయల ఆర్థిక సాయం

ప్రభుత్వం నుండి అదనపు సహాయం

ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ ఆయన కోసం ప్రార్థిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.