
📌 Key Points
- తేజ సజ్జా ‘మిరాయ్’ మూవీలో కీలక పాత్ర పోషించిన సునీల్ థాపా ఇకలేరు!
- గుండెపోటుతో ఖాట్మాండ్‌లో తుదిశ్వాస విడిచిన 68 ఏళ్ల సీనియర్ నటుడు!
- 40 ఏళ్ల కెరీర్‌లో 300+ చిత్రాల్లో నటించిన సునీల్ థాపా సేవలకు సెల్యూట్!
- ‘మేరీకోమ్’లోనూ మెప్పించిన థాపా.. టాలీవుడ్‌లో విషాద ఛాయలు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం! ‘మిరాయ్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సునీల్ థాపా హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
సునీల్ థాపా ఇకలేరు.. గుండెపోటుతో మృతి!
తేజ సజ్జా నటించిన `మిరాయ్` మూవీలో కీలక పాత్రలో నటించిన నేపాలీ నటుడు సునీల్ థాపా(68) కన్నుమూశారు. హార్ట్ఎటాక్‌కి గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఖాట్మాండ్ ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆయనకు సంతాపం తెలియజేసింది. `మిరాయ్` మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే.
సునీల్ థాపా తన 40ఏళ్ల కెరీరలో 300లకుపైగా చిత్రాల్లో నటించాడు. తెలుగులో `మిరాయ్`తోపాటు బాలీవుడ్ `మేరీకోమ్` వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, నేపాలీ, భోజ్‌పురి భాషల్లో ఆయన సినిమాలు చేశారు. సునీల్ థాపా హిందీ ఫిల్మ్ `ఏక్ దుజే కే లియే` (1981) చిత్రంతో నటుడిగా మారారు. హిందీ సినిమాలతో పాపులర్ అయి, ఆ తర్వాత నేపాలీ చిత్రాల్లో వరుసగా అవకాశాలు అందుకున్నారు. స్టార్ యాక్టర్‌గా రాణించారు. సునీల్ థాపా నటుడిగా అనేక అవార్డులు అందుకున్నారు.
‘మిరాయ్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం!
40 ఏళ్ల సినీ ప్రస్థానానికి సెల్యూట్!
సునీల్ థాపా మరణం టాలీవుడ్‌కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


