
📌 Key Points
- తేజ సజ్జా ‘మిరాయ్’ బుల్లితెరపై సంచలనం, 9.1+ టీఆర్‌పీ రేటింగ్ నమోదు.
- 2026లో ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన సినిమాల్లో ఇదే అత్యధిక రేటింగ్.
- ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా టీవీలో ఆదరణ తగ్గలేదని నిరూపితం.
- ‘మిరాయ్’ హిందీ వెర్షన్ కూడా స్టార్ గోల్డ్‌లో టాప్ రేటెడ్ చిత్రంగా నిలిచింది.
తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ చిత్రం బుల్లితెరపై సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైన ఈ సినిమా ఏకంగా 9.1+ టీఆర్‌పీ రేటింగ్ సాధించి సంచలనం సృష్టించింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఇంతటి ఆదరణ లభించడం విశేషం.
బుల్లితెరపై ‘మిరాయ్’ సంచలనం
Mirai: టాలీవుడ్ యంగ్ సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను ఆపడం లేదు. ‘హనుమాన్’ (Hanu-Man) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన ఈ కుర్ర హీరో, ఆ తర్వాత వచ్చిన సూపర్ యోధ చిత్రం ‘మిరాయ్’ (Mirai)తోనూ రికార్డులు కొల్లగొట్టాడు. తాజాగా ఈ చిత్రంతో బుల్లితెరపై సరికొత్త చరిత్రను లిఖించాడు. థియేటర్లలో కోట్లు కొల్లగొట్టడం, ఓటీటీలో వ్యూస్ సునామీ సృష్టించడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు శాటిలైట్ రంగంలోనూ ఎవరూ ఊహించని రేంజ్‌లో టీఆర్‌పీని సాధించి, రికార్డ్‌ను క్రియేట్ చేసిందీ చిత్రం. సాధారణంగా ఓటీటీలో సినిమా రిలీజ్ అయ్యాక టీవీలో చూసే వారి సంఖ్య తగ్గుతుందనేది ఒక అంచనా. కానీ ‘మిరాయ్’ విషయంలో అది పూర్తిగా తప్పని నిరూపితమైంది. ఇటీవల స్టార్ మా (Star Maa) ఛానెల్‌లో ప్రసారమైన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు జనాలు బ్రహ్మరథం పట్టారు.
రికార్డులు కొల్లగొట్టిన తేజ సజ్జా సినిమా
తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం, ఈ సినిమాకు ఏకంగా 9.1+ టీఆర్‌పీ నమోదైందని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ సమయంలో పీక్ రేటింగ్ ఏకంగా 10.8 తాకడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. 2026లో ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ రేటింగ్ కావడం మరో విశేషం. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవడమే కాకుండా, తన సినిమాలతో ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రభాస్, మహేష్ వంటి దిగ్గజాల సరసన నిలబడటం తేజ సజ్జా ఎదుగుదలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కార్తీక్ ఘట్టమనేని విజువల్ వండర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు తోడవడంతో ‘మిరాయ్’ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. పురాణ గాథలు, ఆధునిక యాక్షన్ కలగలిసిన ఈ సినిమాకు కేవలం యూత్ మాత్రమే కాదు, టీవీల ముందు కూర్చున్న ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారన్నమాట.
టీఆర్‌పీ రేటింగ్స్‌లో సరికొత్త చరిత్ర
కేవలం తెలుగులోనే కాదు, గతేడాది (2025) చివరలో ‘స్టార్ గోల్డ్’లో ప్రసారమైన ‘మిరాయ్’ హిందీ వెర్షన్ కూడా అక్కడ టాప్ రేటెడ్ చిత్రంగా నిలిచిందని తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ‘సూపర్ యోధ’కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ టీఆర్‌పీ రేటింగ్స్ చూస్తుంటే, రాబోయే ‘మిరాయ్ 2’ మీద అంచనాలు ఓ రేంజ్‌లో ఉండటం ఖాయం. అసలు టీవీల్లో సినిమాలే చూడటం లేదని బాధపడుతున్న ఛానెల్స్ యాజమాన్యాలకు ‘మిరాయ్’ ఒక బూస్ట్ నిచ్చింది. కంటెంట్ ఉంటే ఎక్కడైనా కొట్టొచ్చనే ఒక ధైర్యాన్నిచ్చిందని అంతా అనుకుంటున్నారు. నిజంగా ఈ స్థాయి టీఆర్‌పీని సాధించడం అంటే మాములు విషయం కాదు. థియేటర్లు, ఓటీటీలలో చూసిన సినిమాకు ఈ మధ్యకాలంలో ఇలాంటి రేటింగ్ రాలేదనే చెప్పుకోవాలి.
‘మిరాయ్’ చిత్రం సాధించిన ఈ విజయం తేజ సజ్జా కెరీర్‌కు మరింత ఊపునిస్తుందని చెప్పవచ్చు. రాబోయే ‘మిరాయ్ 2’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేలా ఉంది.


