|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Miss World 2025 : మిస్ వరల్డ్ పోటీలకు ఎంట్రీ పాసులు

Published: 06-05-2025, 12:14 PM
Miss World 2025 : మిస్ వరల్డ్ పోటీలకు ఎంట్రీ పాసులు

హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. మే 7 నుండి 31 వరకు జరుగనున్న ఈ అందాల పోటీలకు 140 దేశాల నుండి సుందరీమణులు వస్తున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఉచిత ప్రవేశ పాసులను అందిస్తోంది.

Key Points

1

మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 పోటీలు.

2

140 దేశాల నుండి అందాల పోటీదారులు హాజరు.

4

టూరిజం వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి.

మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం

హైదరాబాద్(Hyderabad) నగరం 72వ మిస్ వరల్డ్-2025(Miss World 2025) పోటీల కు ఆతిథ్యం ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన సుందరీమణులు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను(Entry Passes) అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism) పేర్కొంది. ఈ పోటీలను చూసేందుకు ఆసక్తి ఉన్నవారు టూరిజం శాఖ అధికారిక వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఎంపిక చేసిన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని అధికారులు తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు https://tourism.telangana.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుండి పాల్గొనేవారు

ఉచిత ప్రవేశ పాసుల కోసం నమోదు

మిస్ వరల్డ్ 2025 వేడుకను హైదరాబాద్‌లో చూడాలనుకునే వారు త్వరగా నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం. ఉచిత ప్రవేశ పాసుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.