|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్‌ సుచాత చౌంగ్‌శ్రీకి దక్కే ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా? రాయల్ లైఫ్‌ వేరే లెవెల్‌

Published: 31-05-2025, 2:13 PM
మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్‌ సుచాత చౌంగ్‌శ్రీకి దక్కే ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా? రాయల్ లైఫ్‌ వేరే లెవెల్‌

హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చౌంగ్ శ్రీ విజేతగా నిలిచింది. ఆమెకు దక్కిన భారీ ప్రైజ్ మనీ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత చౌంగ్ శ్రీకి 8.4 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ.

2

థాయిలాండ్ నుండి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి మహిళ ఓపల్.

4

ప్రపంచ స్థాయి బ్రాండ్ల యాడ్స్, ఛారిటీ ఈవెంట్స్ ద్వారా ఓపల్ రాయల్ లైఫ్ స్టార్ట్.

ఓపల్ సుచాత చౌంగ్ శ్రీ – మిస్ వరల్డ్ 2025 విజేత

మిస్‌ వరల్డ్ 2025 అందాల పోటీలు హైదరాబాద్‌ వేదికగా గత ఇరవై రోజులుగా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ అందాల పోటీలు ముగిశాయి. శనివారం సాయంత్రం ఆద్యంతం గ్రాండ్‌గా, ఉత్కంఠభరింతంగా జరిగిన ఈ వేడుకలో విన్నర్‌ ఎవరో తేలిపోయింది. థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత చౌంగ్‌ శ్రీ విజేతగా నిలిచింది. మిస్‌ వరల్డ్ 2025 అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.

థాయిలాండ్ నుంచి మిస్‌ వరల్డ్ టైటిల్‌ నెగ్గిన తొలి అమ్మాయిగా ఓపల్‌ చరిత్ర సృష్టించింది. దాదాపు డెబ్బై నాలుగు ఏళ్ల మిస్‌ వరల్డ్ చరిత్రలో ఎప్పుడూ థాయిలాండ్‌ అమ్మాయి ఫైనల్‌కి రాలేదు.

ఈ క్రమంలో తాజాగా ఓపల్‌ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. ఆమె అంతకు ముందే మిస్‌ యూనివర్స్ థాయిలాండ్‌ 2024 విన్నర్‌గా నిలిచింది.  అలాగే మిస్‌ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొని థర్డ్ రన్నరప్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే మిస్‌ వరల్డ్ 2025 విజేతగా నిలిచిన ఓపల్‌ సుచాతకి ఎంత ప్రైజ్‌ మనీ దక్కుతుంది. ఎలాంటి బెనిఫిట్స్ ఆమె పొందనుంది అనేది తెలుసుకుందాం.

మిస్‌ వరల్డ్ 2025 కిరీటం విజేతకి దక్కే ప్రైజ్‌ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే. విజేతలకు ఏకంగా ఒక మిలియన్‌ డాలర్లు ప్రైజ్‌ మనీ కింద అందిస్తారు. అంటే మన ఇండియన్‌ కరెన్సీ ప్రకారం ఎనిమిదన్నర(8.4) కోట్లు ప్రైజ్‌ మనీ రూపంలో దక్కనుంది.

ప్రైజ్ మనీ మరియు ఇతర ప్రయోజనాలు

దీంతో ఒక్కసారి విన్నర్‌ అయ్యారంటే లైఫ్‌ సెట్‌ అయిపోయినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు వారి లైఫ్‌ ఓవర్‌ నైట్‌లో మారిపోతుంది. ఓవర్‌ నైట్‌లో ప్రపంచంలోనే స్టార్‌గా అవతరిస్తారు. ఇప్పుడు ఓపల్‌ కూడా వరల్డ్ స్టార్‌గా మారిపోవడం విశేషం.

మిస్‌ వరల్డ్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఇక వారికి కమర్షియల్‌ యాడ్స్ కి కొదవలేదు. ప్రపంచ స్థాయి బ్రాండ్స్ ఆమె వెంటపడతాయి. కోట్లు కుమ్మరించి తమ బ్రాండ్లని ప్రమోట్‌ చేయాలని రిక్వెస్ట్ చేస్తుంటారు. కేవలం ప్రైజ్‌ మనీనే కాదు, ఇలా యాడ్స్ రూపంలోనూ వారు డబుల్‌ సంపాదిస్తారని చెప్పొచ్చు.

దీంతోపాటు ఏడాదిపాటు ఫుల్‌ బిజీగా ఉండాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అందుకోసం ప్రపంచం మొత్తం తిరగాల్సి వస్తుంది. ఈ ఈవెంట్లకు అయ్యే ఖర్చు స్పాన్సర్లు భరిస్తారు.

ఈవెంట్లలో పాల్గొనే మిస్‌ వరల్డ్ విన్నర్‌ కి అయ్యే ఖర్చులు కూడా వారే భరిస్తారు. లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు. ఓ రకంగా ఏడాదిపాటు మిస్‌ వరల్డ్ విజేతలు రాయల్‌ లైఫ్‌ అనుభవిస్తారని చెప్పొచ్చు.

ఓపల్ భవిష్యత్తు మరియు రాయల్ లైఫ్‌

దీంతోపాటు `బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌` పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌ తరఫున ఈ కార్యక్రమాలు ఉంటాయి. మిస్‌ వరల్డ్ ఆర్గనైజేషన్‌కి ఏడాది పాటు రాయబారిగా మిస్‌ వరల్డ్ విజేత వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇది నిర్వహించే ఛారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్‌ని అనాథ పిల్లలకు, మానసికంగా, ఫిజికల్‌గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు.

ఇప్పుడు మిస్‌ వరల్డ్ 2025 విన్నర్‌గా నిలిచిన థాయిలాండ్‌ అందగత్తె ఓపల్‌ సుచాత ప్రపంచ స్థాయి సెలబ్రిటీ అయిపోయింది. ఏడాదిపాటు ఆమె బిజీగా గడపబోతుంది.

దీంతోపాటు వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తుంటాయి. ఆమె ఒప్పుకుంటే, సినిమాలు సక్సెస్‌ అయితే ఇక ఆమెకి తిరుగులేదని చెప్పొచ్చు. మరి ఓపల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కెరీర్‌ని ఎలా మలుచుకుంటుందో చూడాలి.

మిస్ వరల్డ్ 2025 విజయంతో ఓపల్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కోట్లల్లో ప్రైజ్ మనీతో పాటు, అనేక అవకాశాలు ఆమెను ఎదురుచూస్తున్నాయి. ఆమె భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండబోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.