|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిస్ వరల్డ్ 2025 విజేత: ఓపల్ సుచాతకి 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్, భరించలేని నరకం.. ఆమె జీవితం గురించి ఈ విషయాలు తెలుసా

Published: 31-05-2025, 2:43 PM
మిస్ వరల్డ్ 2025 విజేత: ఓపల్ సుచాతకి 16 ఏళ్ళ వయసులోనే క్యాన్సర్, భరించలేని నరకం.. ఆమె జీవితం గురించి ఈ విషయాలు తెలుసా

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాత విజేతగా నిలిచింది. 21 ఏళ్ల ఈ యువతి తన అద్భుతమైన అందం, ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఆమె జీవితం, విజయ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

Key Points

1

మిస్ వరల్డ్ 2025 టైటిల్‌ను ఓపల్ సుచాత గెలుచుకుంది.

2

ఆమె థాయిలాండ్‌కు చెందిన 21 ఏళ్ల యువతి.

4

ఓపల్ విజయం థాయిలాండ్‌కు చరిత్రాత్మకమైనది.

ఓపల్ సుచాత: ఒక అద్భుతమైన విజయం

హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీలు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. మిస్ వరల్డ్ ఫైనల్స్ శనివారం మే 31న చాలా గ్రాండ్ గా జరిగాయి. అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన మిస్ వరల్డ్ పోటీల్లో ఆసియా ఖండానికి చెందిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచారు.

మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా చేతుల మీదుగా ఆమె మిస్ వరల్డ్ 2025 కిరీటం అందుకున్నారు. 21 ఏళ్ళ యంగ్ బ్యూటీ సంచలనం సృష్టించడంతో ప్రపంచవ్యాప్తంగా ఓపల్ పేరు మారుమోగుతోంది.

ఓపల్ సుచాతా గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఆమె ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చింది ? ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి ? మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునే స్థాయికి ఎలా ఎదిగింది ? లాంటి అంశాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకోవచ్చు.

ఓపల్ సుచాత సెప్టెంబర్ 20, 2003లో జన్మించింది. ఆమె థాయిలాండ్ లోని ఫుకెట్ నగరానికి చెందిన అమ్మాయి. థాయిలాండ్ నుంచి మిస్ వరల్డ్ గెలిచిన తొలి మహిళగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించింది. ఆమె తల్లిదండ్రులు థానెట్ డోంకామ్నెర్డ్, సుపాత్ర చువాంగ్స్రీ. ఆమె కుటుంబం ఫుకెట్ నగరంలో వ్యాపారంలో రాణిస్తున్నారు.

ఆమె జీవితం మరియు విద్యాభ్యాసం

ఆమె విద్యాభ్యాసం మొత్తం థాయిలాండ్ లోనే సాగింది. ప్రస్తుతం ఓపల్ బ్యాంకాక్ లోని తమ్మాషాట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు. పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఆమె డిగ్రీ చేస్తుండడం విశేషం.

ఓపల్ సుచాత 2021 నుంచి బ్యూటీ పేజెంట్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. 2021లో ఆమె ‘మిస్ రత్తనకోసిన్’ పోటీల్లో పాల్గొంది. కానీ ఈ పోటీల్లో ఆమె ఎంపిక కాలేదు. అయినప్పటికీ ఓపల్ నిరాశ చెందలేదు. ఆ మరుసటి ఏడాది 2022లో సుచాత మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొంది. మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలు ఆమెకి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఈ పోటీల్లో సుచాత మూడవ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత తొలి రన్నరప్ తప్పుకోవడంతో సుచాతకి రెండవ రన్నరప్ గా అవకాశం దక్కింది.

2024లో తన పేరు ప్రపంచం మొత్తం తెలిసేలా సుచాతా బలమైన ముద్ర వేసింది. మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. అదే ఏడాది మెక్సికోలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఆమెకి దక్కింది. ఛాన్స్ దక్కడమే కాదు.. మిస్ యూనివర్స్ పోటీల్లో మూడవ రన్నరప్ గా నిలిచింది. ఆయా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ స్థానాన్ని ఆమె కోల్పోవలసి వచ్చింది.

ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ సుచాత మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకునే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో ఆమెకి 16 ఏళ్ళ వయసులో జీవితంలో అతిపెద్ద సవాల్ ఎదురైంది. 16 ఏళ్ళ వయసులోనే సుచాత బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యారు. తనకి క్యాన్సర్ ఉందని తెలుసుకున్న క్షణం భరించలేని ఒత్తిడికి, భయానికి గురైనట్లు సుచాత పేర్కొంది. దీనివల్ల నేను కన్న కలలన్నీ నాశనం అవుతాయని అనుకున్నా. ఆక్షణంలో నా చేతుల్లో ఏమీ లేదు.. మొత్తం కోల్పోయా అనే ఫీలింగ్ కలిగింది.

మిస్ వరల్డ్ పోటీలలో ఆమె ప్రయాణం

నాకు సోకిన బ్రెస్ట్ క్యాన్సర్ అంత అపాయకరమైనది కాదు. అయినప్పటికీ ఆ వయసులో నాకు కలిగిన ఆందోళన అంతా ఇంతా కాదు. నాలో కలిగిన ఆ ఆందోళనే తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అని సుచాత పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎదుర్కొనడానికి ఆ సమయంలో నాకు అన్ని వనరులు ఉన్నాయి. కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ తో ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించా.

అలాంటి మహిళల కోసమే ‘ఓపల్ ఫర్ హర్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించాను. బ్రెస్ట్ హెల్త్ విషయంలో అమ్మాయిలకు సహకారం, అవగాహన అవసరం అని నేను నమ్ముతా. వాళ్ళు ఒంటరిగా పోరాటం చేయకూడదు. తన ఓపల్ ఫర్ హర్ సంస్థ ద్వారా చాలా మంది మహిళలకు ఉచిత స్క్రీనింగ్ అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు.

పాఠశాలల్లో ఆరోగ్య విద్యను ప్రోత్సహించాం, నిజ జీవిత కథల్ని పాడ్‌కాస్ట్‌ల ద్వారా పంచుకున్నాం, థాయిలాండ్‌లో మెరుగైన ఆరోగ్య విధానాల కోసం పోరాడుతున్నాం అని ఓపల్ పేర్కొంది.  ఓపల్ మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నందుకు ఆమెని అభినందిస్తున్న నెటిజన్లు.. ఆమె చేస్తున్న ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని కూడా కొనియాడుతున్నారు. సుచాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆదర్శం అని అంటున్నారు.

ఓపల్ సుచాత యొక్క విజయం ప్రేరణాదాయకం. ఆమె కృషి, నిబద్ధత, తనను తాను నమ్ముకోవడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఆమె భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.