|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోహన్ బాబు @74: సినీ ప్రస్థానం నుండి విద్యా సామ్రాజ్యం వరకు – ఆస్తుల వెనుక అసలు కథ!

Published: 19-03-2026, 6:05 AM
మోహన్ బాబు @74: సినీ ప్రస్థానం నుండి విద్యా సామ్రాజ్యం వరకు - ఆస్తుల వెనుక అసలు కథ!
  • మోహన్ బాబు 50 ఏళ్ల సినీ కెరీర్‌లో 500కు పైగా సినిమాలలో నటించారు.
  • శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను 1992లో మోహన్ బాబు స్థాపించారు.
  • మోహన్ బాబు తన ఆస్తులను ముగ్గురు వారసులకు సమానంగా పంచుతానని తెలిపారు.
  • మంచు విష్ణు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటున్నారు.

మోహన్ బాబు 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన సినీ జీవితం, విద్యాసంస్థల స్థాపన, ఆస్తుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఆయన నట ప్రస్థానం, విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం.

మోహన్ బాబు సినీ జీవితం

HBD Mohan Babu:క్రమశిక్షణకు మారుపేరుగా.. కలెక్షన్ కింగ్ గా.. తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో.. మెప్పించదగిన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు మోహన్ బాబు (Mohan Babu). భక్తవత్సలం నాయుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. నేడు 74వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ సెలబ్రెటీలు, అభిమానులు, నెటిజన్స్, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు మోహన్ బాబుకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలతో మొదలైన ఆయన ప్రయాణం నేడు యూనివర్సిటీ స్థాయికి చేరింది. ఈ ప్రయాణంలో ఆయన సంపాదించిన ఆస్తులు ఎంత అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్తావన వస్తే చాలు.. ప్రథమంగా మోహన్ బాబు పేరు వినిపిస్తుంది. 50 ఏళ్ల సినీ కెరియర్ లో 500కు పైగా సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప వ్యక్తిగా ఎదిగారు. బయట గంభీరంగా ఉండే మోహన్ బాబు తెలిసిన వాళ్ళకు మాత్రం కష్టం వచ్చిందంటే క్షణం ఆలోచించకుండా సహాయపడతారు. ఇప్పటికే ఎంతోమంది ఈ విషయాన్ని పంచుకున్నారు కూడా.. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, అటు రాజకీయ నాయకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న మోహన్ బాబు.. డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, పద్మశ్రీ తో పాటు లెక్కలేనన్ని అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. నిర్మాతగా, నటుడిగా, వ్యాపార రంగాలలో సక్సెస్ఫుల్ గా రాణించి కోట్లు సంపాదించారు. ముఖ్యంగా తన ఆస్తులను తన వారసులు ముగ్గురికి సమానంగా పంచుతానని ఎన్నో సందర్భాలలో తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన ఆస్తిలో ఎక్కువ విలువ ఉన్న వాటిలో తిరుపతిలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

శ్రీ విద్యానికేతన్ స్థాపన

1992లో స్థాపించిన ఈ విద్యా సంస్థ ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరుకుంది. వేల మంది విద్యార్థులు ఈ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఇక మంచు విష్ణు (Manchu Vishnu)కి, ఈ విద్యాసంస్థలకు సంబంధించిన పూర్తి బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) స్థాపించిన 24 ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ సంస్థ బాధ్యతలు కూడా విష్ణుకే ఇచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు కి హైదరాబాదులో ఖరీదైన బంగ్లాలు, రంగారెడ్డి జిల్లా జల్ పల్లి లో ఫామ్ హౌస్ కూడా ఉంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఆయన అక్కడే ఉంటున్నారు.. అలాగే ఫిలింనగర్ లో ఒక ఇల్లు, హైదరాబాదులో పలు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. లక్ష్మీ ప్రసన్నకు ఫిలింనగర్ లో ఇచ్చిన ఇల్లు తో పాటు కొన్ని విలువైన ఫ్లాట్లు కూడా ఆమెకు ఇచ్చినట్లు సమాచారం.

ఆస్తుల పంపకం మరియు వారసులు

ఇక దీంతోపాటు పలు ల్యాండ్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు కూడా వీరికి ఉన్నాయి. ఇకపోతే చెన్నైలో కూడా పలు నివాస స్థలాలు, కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి.. ఇక సుమారుగా వీటి నికర విలువ 600 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.. ఏది ఏమైనా సినిమాల ద్వారా తన కెరీర్ ను ఆరంభించి, నేడు వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యారు మోహన్ బాబు.

మోహన్ బాబు సినీ రంగంలోనే కాకుండా విద్యా సంస్థల ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన ఆస్తులను సమానంగా పంచుతానని చెప్పడం ఆయన గొప్ప మనస్సును తెలుపుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.