|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినీ దిగ్గజం మోహన్‌లాల్‌కు తీరని లోటు.. తల్లి మరణంతో కన్నీళ్లు!

Published: 30-12-2025, 6:08 AM
సినీ దిగ్గజం మోహన్‌లాల్‌కు తీరని లోటు.. తల్లి మరణంతో కన్నీళ్లు!
  • సీనియర్ నటుడు మోహన్‌లాల్ తల్లి శాంతకుమారి (86) కన్నుమూత.
  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఎలమక్కరలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.
  • మోహన్‌లాల్ కొచ్చిలో ఉండగా వార్త తెలిసింది, హుటాహుటిన ఎర్నాకుళంకు చేరుకున్నారు.
  • బుధవారం శాంతకుమారి అంత్యక్రియలు నిర్వహణ, సినీ ప్రముఖులు, అభిమానుల నివాళులు.

మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (86) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. కొచ్చిలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది, పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

శాంతకుమారి మృతి: కారణాలు, ఆఖరి క్షణాలు

Mohanlal Mother Death: మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు మోహన్ లాల్(Mohan Lal) ఒకరు. గత నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ లాల్ తల్లి శాంత కుమారి(Santhakumari) (86) నేడు కన్నుమూశారు. వయసు పైబడటంతో గత కొంతకాలంగా శాంతకుమారి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్య సమస్యల కారణంగా శాంతకుమారి కొచ్చిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండేవారు. అయితే ఈమె ఇటీవలే హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తుంది. నేడు ఈమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిన నేపథ్యంలో ఎర్నాకుళం జిల్లాలోని ఎలమక్కరలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఇలా శాంతకుమారి మరణించిన సమయంలో నటుడు మోహన్ లాల్ కొచ్చిలో ఉన్నారు.

తన తల్లి మరణ వార్తను తెలుసుకున్న మోహన్ లాల్ ఇతర కుటుంబ సభ్యులు ఎర్నాకులం చేరుకున్నారని తెలుస్తోంది. ఇలా శాంత కుమారి నేడు మరణించడంతో ఈమె అంత్యక్రియలను బుధవారం నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.శాంతకమారి మరణ వార్తను తెలియచేయడంతో ఇతర సినీ సెలబ్రిటీలు, అభిమానులు మోహన్ లాల్ తల్లి మరణం పట్ల స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. మోహన్ లాల్ కు తన తల్లి అంటే ఎంతో అమితమైన ప్రేమ, గౌరవం ఉన్న సంగతి తెలిసినదే. తరుచు తన తల్లికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తల్లితో మోహన్‌లాల్ అనుబంధం: తీరని లోటు

ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇటీవల మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఇంతటి గౌరవప్రదమైన పురస్కారాన్ని సొంతం చేసుకున్న తర్వాత మోహన్ లాల్ నేరుగా తన తల్లిని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా తన తల్లి పట్ల ఎంతో ప్రేమ గౌరవం ఉన్నటువంటి ఈయనకు మాతృవియోగం కలగడం అభిమానులను కూడా బాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మృతి పట్ల నివాళులు అర్పిస్తున్నారు.

ఇక మోహన్ లాల్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల వృషభ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2025లో మోహన్ లాల్ నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. వృషభ సినిమా తప్ప మిగిలను సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ ఈ సినిమా విడుదలైంది. సుమారు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల అయ్యి ఐదు రోజులు అవుతున్న కేవలం రెండు కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో భారీ నష్టాలను ఎదుర్కొందనే తెలుస్తోంది.

సినీ ప్రముఖుల నివాళులు, అంత్యక్రియల ఏర్పాట్లు

తల్లిని అపారంగా ప్రేమించే మోహన్‌లాల్‌కు ఈ మాతృవియోగం తీరని లోటును మిగిల్చింది. ఆయన వ్యక్తిగత జీవితంలో ఇది అత్యంత బాధాకరమైన సందర్భం. ఈ క్లిష్ట సమయంలో మోహన్‌లాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అభిమానుల ప్రగాఢ సానుభూతి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.