|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయి పల్లవితో విజయ్ సేతుపతి రొమాన్స్! ధనుష్ అవుట్.. మణిరత్నం సంచలన నిర్ణయం!

Published: 23-02-2026, 6:05 AM
సాయి పల్లవితో విజయ్ సేతుపతి రొమాన్స్! ధనుష్ అవుట్.. మణిరత్నం సంచలన నిర్ణయం!
  • మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా కొత్త సినిమా.
  • ధనుష్‌ను కాదని విజయ్ సేతుపతిని ఎంపిక చేసిన మణిరత్నం.
  • ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
  • 2026 మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుండగా, 2026 చివరిలో విడుదల చేయాలని ప్లాన్.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తదుపరి సినిమా కోసం సాయి పల్లవితో కలిసి విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. తొలుత ధనుష్‌ను అనుకున్నా, కొన్ని కారణాల వల్ల విజయ్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా మణిరత్నం సినిమా

Sai Pallavi: తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక కొత్త ప్రేమకథా సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతూ అందరిలో తెగ ఆసక్తి తీసుకొస్తుంది. అసలు విషయానికి వస్తే విజయ్ సేతుపతి, హీరోయిన్‌గా.. మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అన్న వార్త తెగ వైరల్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ చేయబోతున్నారు అని కూడా ఫిక్సయినట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రెజెంట్ చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రకటించబడినప్పటి నుంచే ఇండస్ట్రీలో బలమైన బజ్ నెలకొంది. ‘థగ్ లైఫ్’ సినిమా పూర్తయ్యాక మణిరత్నం ఒకేసారి రెండు కథలపై పని చేశారని సమాచారం. చాలా ఆలోచనల తర్వాత ఆయన ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ కథను మొదట హీరో ధనుష్కు వినిపించారట. ఆయనకు కథ నచ్చినప్పటికీ, పారితోషిక చర్చల కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని తెలుస్తోంది. తర్వాత ఈ కథను సింబు (శింబు)తో కూడా చర్చించినట్లు సమాచారం. చివరికి ఈ కథ విజయ్ సేతుపతితో ఖరారైంది.

ధనుష్‌ను తప్పించిన మణిరత్నం

ఈ సినిమా మణిరత్నం–విజయ్ సేతుపతి కలయికలో రెండో చిత్రం కావడం విశేషం. వీరిద్దరూ ఇప్పటికే 2018లో వచ్చిన చెక్క చివంత వానమ్ సినిమాలో కలిసి పనిచేశారు. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ‘రసూల్’ అనే పోలీస్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఆమె సహజ నటన, భావోద్వేగాలను సులభంగా చూపించే శైలి మణిరత్నం ప్రేమకథకు చాలా సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్‌కు ధృవ్ విక్రమ్, రుక్మిణి వసంత్ పేర్లు వినిపించినా, చివరికి విజయ్ సేతుపతి–సాయి పల్లవి జోడీనే ఖరారు చేశారు.

2026లో షూటింగ్ ప్రారంభం, విడుదల

విజయ్ సేతుపతి తన ‘పాకెట్ నవల్’ సినిమా పూర్తి చేసిన తర్వాత, 2026 మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం షూటింగ్ లొకేషన్ల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. మణిరత్నం దర్శకత్వం, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ఉండటంతో ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు తీసుకొచ్చింది.

మొత్తానికి మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరింత ప్లస్ కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.