
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.
- మోక్షజ్ఞ ఇటీవల ప్రశాంత్ వర్మ సినిమా, ఆదిత్య 369 సీక్వెల్ తో ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయి.
- తాజాగా మోక్షజ్ఞ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కలిశారు.
- ఎమ్మెల్యేతో మోక్షజ్ఞ కలిసి దిగిన ఫొటోలు, ఆయన లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మోక్షజ్ఞ టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి కనిపించి వార్తల్లో నిలిచారు. ఈ భేటీ ఫొటోలు, మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై కొనసాగుతున్న ఆసక్తి
Mokshagna : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడు, హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతుంది. ఫ్యాన్స్ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ప్రకటించారు. ఈ సినిమా నుంచి మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు.(Mokshagna)
ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ తో ఎంట్రీ ఇస్తాడని బాలయ్య పలుమార్లు చెప్పినా ఆ సినిమా గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పటికప్పుడు చర్చగానే మారుతుంది.
టీడీపీ ఎమ్మెల్యేతో మోక్షజ్ఞ అరుదైన భేటీ
ఇక మోక్షజ్ఞ బయట చాలా తక్కువగా కనిపిస్తాడు. దీంతో ఎప్పుడు కనిపించినా మోక్షజ్ఞ లుక్స్ వైరల్ అవుతాయి. తాజాగా మరోసారి మోక్షజ్ఞ ఓ ఫంక్షన్ లో కనిపించి వైరల్ అవుతున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ లుక్స్
మోక్షజ్ఞ తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్లడంతో అక్కడ మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని కలిసి మాట్లాడారు. ప్రత్తిపాటి పుల్లారావు మోక్షజ్ఞను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రైవేట్ ఫంక్షన్ లో మోక్షజ్ఞను కలిసాను, సినీ, కుటుంబ విషయాలు మాట్లాడాను అని చెప్పడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడిస్తాడో? ఏ సినిమాతో ఇస్తాడో చూడాలి..?
మోక్షజ్ఞ ఎంట్రీపై ఎదురుచూపులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ తాజా భేటీ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. మరి మోక్షజ్ఞ ఎప్పుడు, ఏ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తారో చూడాలి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని ఆశిద్దాం.


