|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ramayana Movie: సినిమా బడ్జెటా.. స్టేట్ బడ్జెటా.. అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

Published: 14-07-2025, 11:34 PM
Ramayana Movie: సినిమా బడ్జెటా.. స్టేట్ బడ్జెటా.. అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

నమిత్ మల్హోత్రా నిర్మించే రామాయణం సినిమా రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ, ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వస్తుందనేది చర్చనీయాంశం.

భారీ బడ్జెట్‌తో రామాయణం

రామాయణ మూవీపై భారీ హైప్ పెంచేశాడు నిర్మాత నమిత్ మల్హోత్రా. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్న సినిమా ఇప్పటికే ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేయగా.. లేటెస్ట్ పాడ్‌కాస్ట్‌‌తో మరింత హైప్ తీసుకొచ్చాడు ప్రొడ్యూసర్. రెండు పార్ట్స్ కలిపి ఏకంగా నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి రాగా.. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినా.. జపాన్, చైనీస్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే ఈజీగా లాభాల్లోకి వెళ్లొచ్చని, ప్రీరిలీజ్ బిజినెస్‌తోనే గట్టెక్కొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంకొందరు మాత్రం అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. అది సినిమా బడ్జెటా లేక రాష్ట్ర బడ్జెటా అని అడుగుతున్నారు.

ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా… ప్రతీ ట్యూన్ కూడా యూనిక్‌గా ఉంటుందని తెలిపాడు నిర్మాత. రాముడికి ఒక థీమ్, రావణకు మరో థీమ్.. సీతమ్మ ప్రేమకు ఇంకో థీమ్.. ఇలా ప్లాన్ చేశారని.. ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తామని హామీ ఇచ్చాడు. మొత్తానికి ఈ పాడ్ కాస్ట్ ఒకేసారి రామాయణ సినిమాపై హైప్ పెంచడంలో సక్సెస్ అయింది.

ఎక్కడి నుంచి వస్తున్నాయి వేల కోట్లు?

ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశలు

మొత్తంగా, రామాయణం సినిమాపై అంచనాలు అత్యధికంగా ఉన్నాయి. అయితే, ఇంత భారీ బడ్జెట్ ఎలా సమకూరుతుందన్నది ఆసక్తికరమైన ప్రశ్న.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.