
📌 Key Points
- మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసా, ఇప్పుడు పెళ్లితో సంచలనం!
- దర్శకుడు సనోజ్ మిశ్రా ఆవేదన: మోనాలిసా కోసం 10 కోట్లు అప్పు, జైలుకు కూడా వెళ్ళా!
- హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నామని మోనాలిసా, లవ్ జిహాద్ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టీకరణ
- తెలుగులో ‘లైఫ్’ చిత్రంలో నటిస్తున్న మోనాలిసా, భర్తతో కలిసి మీడియా ముందుకు!
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోంస్లే పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్. ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకోవడం, ఆపై వస్తున్న విమర్శలు, లవ్ జిహాద్ ఆరోపణలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏం జరుగుతోంది?
మోనాలిసా పెళ్లి.. వివాదానికి కారణం?
మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించి వైరల్ స్టార్‌గా మారింది మోనాలిసా. సోషల్ మీడియా ఆమెని స్టార్‌ని చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ దెబ్బతో మోనాలిసా భోంస్లేకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఓ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఏకంగా ఆమెని హీరోయిన్‌గా తీసుకుని ఓ సినిమాని కూడా ప్రారంభించారు. అలాగే మలయాళంలో ఓ మూవీ ప్రారంభమయ్యింది. తెలుగులోనూ సినిమా స్టార్ట్ అయ్యింది.
నటిగా బిజీ అవుతున్న సమయంలో మోనాలిసా పెద్ద షాకిచ్చింది. ప్రియుడిని పెళ్లి చేసుకొని అందరిన ఆశ్చర్యపరిచింది. ఆమె కేరళాలోని తిరువనంతపురం, నేమం సమీపంలో ఉన్న అరుమనూర్ జై నైనార్ దేవాలయంలో తన ప్రియుుడు మహారాష్టకి చెందిన ఫర్హాన్ ఖాన్‌ని ఆమె హిందూ సాంప్రదయం ప్రకారం పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె పెళ్లిపై విమర్శలు వస్తున్నాయి. దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. సోషల్ మీడియా స్టార్‌ని చేస్తే, ఆమె తన కెరీర్‌ని నాశనం చేసుకుంటుందని, ప్రేమ పెళ్లి మాయలో పడి మంచి లైఫ్‌ని చెడగొట్టుకుంటుందని విమర్శలు వస్తున్నాయి.
లవ్ జిహాద్ ఆరోపణలపై మోనాలిసా కౌంటర్
వంద కోట్లలో ఎవరికీరాని క్రేజ్, పాపులారిటీ మోనాలిసాకి వచ్చింది. కానీ ఆమె దాన్నంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరులా మార్చిందంటున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తనకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెతో సినిమా కోసం తాను పది కోట్లు లోన్ తీసుకున్నానని, తన ప్రవర్తన వల్ల జైలుకి కూడా వెళ్లి వచ్చానని వెల్లడించారు. ఇది లవ్ జిహాద్ లో భాగమే అని తెలిపారు. ఇలా చాలా మంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా మోనాలిసా స్పందించింది.
తన భర్తతో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చింది. లవ్ జిహాద్ కామెంట్ లో నిజం లేదని, తాము హిందూ సాంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది. తనకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉందని, ఒక మేజర్‌గా తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకునే హక్కు తనకు ఉందని వెల్లడించింది.అయితే పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తానని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ భోంస్లే వీరి పెళ్లిని వ్యతిరేకించారు. ఆమెని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తనకు భద్రత కల్పించాలని మోనాలిసా కేరళ పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే మోనాలిసాకి కేరళ మంత్రులు సపోర్ట్ చేయడం గమనార్హం.
సినిమా కెరీర్‌కి గుడ్ బై చెప్పనుందా?
మోనాలిసా ఇప్పుడు తెలుగులో `లైఫ్` అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో సాయి కిరణ్ హీరో. శ్రీను కోటపాటి దర్శకుడు. వంగమాంబ క్రియేషన్స్ పతాకంపై అజయ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆ మధ్యనే ఈ సినిమా ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమైంది. దీంతోపాటు మలయాళంలో`నాగమ్మ`, బాలీవుడ్‌లో `ది డైరీ ఆఫ్ మణిపూర్` అనే చిత్రాల్లో నటిస్తోంది మోనాలిసా. మరి వీటిని పూర్తి చేస్తుందా? మధ్యలోనే వదిలేస్తుందా అనేది చూడాలి.
మోనాలిసా పెళ్లి వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వస్తున్న విమర్శలు, ఆమె సమాధానం ఆసక్తికరంగా ఉన్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


