|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలీవుడ్‌లోనే అతి ఖరీదైన బంగ్లా అదే.. అమితాబ్, షారూఖ్‌ది కాదు..

Published: 25-06-2025, 4:00 AM
బాలీవుడ్‌లోనే అతి ఖరీదైన బంగ్లా అదే.. అమితాబ్, షారూఖ్‌ది కాదు..

ముంబైలో అత్యంత ఖరీదైన భవనాలకు బాలీవుడ్ ప్రముఖులు ప్రసిద్ధి. కానీ, షారూఖ్, అమితాబ్ లను మించి, రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ దంపతులు కొనుగోలు చేసిన బంగ్లా వార్తల్లో నిలుస్తోంది.

Key Points

1

రణబీర్ కపూర్, ఆలియా భట్ దంపతులు ముంబైలో అత్యంత ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు.

2

ఈ బంగ్లా ధర సుమారు రూ. 250 కోట్లు అని అంచనా.

4

ఈ కొనుగోలు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొత్త చరిత్ర సృష్టించింది.

రూ. 250 కోట్ల విలువైన బంగ్లా

ముంబయిలో అత్యంత ఖరీదైన భవనాలు చాలానే ఉన్నాయి. సహజంగానే వాటిలో ఎక్కువ బాలీవుడ్‌ ప్రముఖులవే. మరీ ముఖ్యంగా షారూఖ్‌ ఖాన్‌ మన్నత్‌ నివాసం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్లు ఒకరిని మించి ఒకరు ఖరీదైన భవనాల యజమానులుగా కావడానికి ఉవ్విళ్లూరుతుంటారు.. అయితే షారూఖ్, అమితాబ్‌ తదితర బిగ్‌స్టార్లు అందరినీ తోసి రాజని ఓ యువ జంట కొనుగోలు చేసిన ఓ ఇల్లు వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటిదాకా బాలీవుడ్‌ ప్రముఖుల అన్ని భవనాల కన్నా ఇదే ఖరీదైనదిగా తెలుస్తోంది.

ముంబై రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది ఆ యువ జంట కొన్న  భవనం. ముంబైలో వీరు కొనుగోలు చేసిన భవనం ఇప్పుడు బాలీవుడ్‌ సర్కిల్‌లో మాత్రమే కాదు ముంబయి నగరంలోననూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ లగ్జరీ బంగ్లా ధర మన్నత్‌ (షారూక్‌ ఖాన్‌ స్వంతమైన ఫేమస్‌ బంగ్లా) కంటే ఎక్కువ కావచ్చన్న ఊహాగానాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భవనానికి వీరు వెచ్చించిన మొత్తం  ముంబై రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

రణబీర్-ఆలియా కొత్త నివాసం

ఎక్కడ ఉందీ బంగ్లా? ఈ అత్యంత ఖరీదైన భవనం ముంబై నగరంలోని  ప్రముఖుల నివాసాలకు ప్రసిద్ధిగాంచిన హై–ఎండ్‌ లోకాలిటీ పాలి హిల్‌ ప్రాంతంలో ఉంది. ఈ లగ్జరీ ప్రాపర్టీ ధర రూ. 250 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే ఇది షారుఖ్‌ ఖాన్‌ మన్నత్‌ కంటే ఖరీదైన ప్రాపర్టీ అవుతుంది. ఎందుకంటే మన్నత్‌ విలువను 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో ఈ తాజా కొనుగోలు ముంబై రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు పెద్ద ప్రోత్సాహంగా మారింది. ప్రముఖుల ఇళ్ల ఖరీదు ఇప్పటివరకు 100–150 కోట్ల మధ్యే ఉండగా, ఈ డీల్‌  మార్కెట్‌ను మరింత ఎగబాకేలా చేసింది. ముంబై నగరంలో ఇదొక కొత్త చరిత్రగా నిలిచింది.

ముంబై రియల్ ఎస్టేట్ లో కొత్త రికార్డు

ఎవరీ జంట? ఈ భవనాన్ని కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన బాలీవుడ్‌ స్టార్‌ జంట రణబీర్‌ కపూర్, ఆలియా భట్‌. వీరి కొత్త బంగ్లా మన్నత్‌ కంటే ఖరీదైనది కాగా  ఈ బంగ్లా కొనుగోలు తమకు పెద్ద గౌరవంగా భావిస్తున్నామని రణబీర్‌–ఆలియా సన్నిహితులతో అంటున్నారని  సమాచారం. ఎంతో స్పెషల్‌గా నిర్మించిన ఇంట్లో పర్సనల్‌ జిమ్, ప్రైవేట్‌ థియేటర్,  హైసెక్యూరిటీ వగైరాలతో పాటు అత్యంత ఆధునిక సదుపాయాలు అన్నీ ఉన్నాయట. ఈ  ఇంటిని కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కాకుండా, రణబీర్‌–ఆలియా తమ ఫ్యామిలీతో నివసించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వారి కుమార్తె రాహా కోసం కూడా అనేక సదుపాయాలు ఇంట్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్టార్‌ జంట కొత్త ఇంట్లోకి త్వరలోనే గృహ ప్రవేశం చేయనుంది.

రణబీర్-ఆలియా దంపతుల కొత్త బంగ్లా కొనుగోలు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ఇది బాలీవుడ్‌లోనే అతి ఖరీదైన బంగ్లాగా నిలిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.