
గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్ర మోషన్ పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. శివ రాజ్ కుమార్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మోషన్ పోస్టర్ చూసి చిత్ర బృందాన్ని అభినందించారు.
Key Points
గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా 'గుమ్మడి నర్సయ్య' చిత్రం తెరకెక్కుతోంది.
మోషన్ పోస్టర్ విడుదలైన కొద్ది రోజులకే 'టాక్ ఆఫ్ ది టౌన్‌గా' మారింది.
గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మోషన్ పోస్టర్‌ను చూసి చిత్ర బృందాన్ని అభినందించారు.
‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ సంచలనం
రాజకీయ నాయకుడు, ప్రజల కోసం బతికే వ్యక్తి గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గుమ్మడి నర్సయ్య’.దీనికి యంగ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తుండగా.. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ పాత్రలో కనిపించబోతోన్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ ఎలా కనిపిస్తారు? ఏ మేరకు ఆకట్టుకుంటారు? అని అంతా అనుకోగా.. అందరి అంచాలను మించి గుమ్మడి నర్సయ్య పాత్రకు శివన్న ప్రాణం పోసేందుకు సిద్దంగా ఉన్నారని అర్థమైంది. ఆ పాత్రకు తగ్గ ఆహార్యంతో శివన్న అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఈ మోషన్ పోస్టర్‌ను చూసిన శ్యామలా దేవి దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. శ్యామలా దేవీ మాట్లాడుతూ .. ‘ఎక్సలెంట్‌గా ఉంది.. ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది.. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తోంది.. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ ప్రాణం పెట్టి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
శివ రాజ్ కుమార్ అద్భుత నటనపై ప్రశంసలు
శ్యామలా దేవి స్పందన, అభినందనలు
మొత్తంగా, ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ అంచనాలను మించిపోయింది. శ్యామలా దేవి వంటి ప్రముఖులు ప్రశంసించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.


