|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమాల పోరు: బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా గెలుస్తుందో చూడాలి!

Published: 13-04-2026, 7:35 AM
సినిమాల పోరు: బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా గెలుస్తుందో చూడాలి!
  • నాగశౌర్య సినిమా ‘బ్యాడ్ బాయ్’ చాలా ఆలస్యంగా విడుదలవుతోంది.
  • కిరణ్ అబ్బవరం ‘తిమ్మరాజుపల్లి TV’తో నిర్మాతగా మారారు.
  • తిరువీర్ ‘పాపం ప్రతాప్’ విలేజ్ లవ్ స్టోరీతో వస్తున్నాడు.
  • మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.

వేసవిలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్’, కిరణ్ అబ్బవరం ‘నిర్మాత’ మరియు తిరువీర్ ‘పాపం ప్రతాప్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్’ సినిమా పరిస్థితి

BOX OFFICE : పెద్ద సినిమాలు ఒకవైపు మండే ఎండలు,మరో వైపు IPL మ్యాచులు.. అయినా పెద్ద సినిమాలేవీ లేవుగా అన్న ధైర్యంతో మూడో వారం కూడా పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్ పై ఎటాక్ చేయడానికి రెడీ అయిపోయాయ్. అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో కనీసం ఈ సినిమాలైనా సౌండ్ చేస్తాయా లేక సైలంట్ గా జారుకుంటాయా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్ .. ఇంతకీ ఆడియన్స్ ని అలరిస్తామంటూ ఏప్రిల్ మూడో వారంలో ఎంట్రీ ఇస్తున్న ఆ సినిమాలేంటో క్విక్ గా చూసేద్దాం.

నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్’.. ఇన్నేళ్ల తర్వాత వర్కవుట్ అవుతుందా?

ఈ మూడో వారంలో వస్తున్న సినిమాల్లో కాస్త ఆడియన్స్ గుర్తు పట్టే హీరో ఉన్న సినిమా ఎదైనా ఉందంటే అది ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమానే. అప్పుడెప్పుడో రంగబలి అంటూ మూడేళ్ళ కిందట టాలీవుడ్ లవర్ బాయ్ నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా ఇది. మూడేళ్ళ క్రితమే మొదలైన ఈ సినిమా ఎట్టకేలకి ఈ నెల 17న పలకరించడానికి రెడీ అయిపొయింది. అయితే ఈ సినిమా ఇప్పటికే అవుట్ డేటెడ్ కంటెంట్ తో వస్తుందన్న టాక్ ఉంది. ఒకరకంగా ఇది శౌర్యకి డూ ఆర్ డై సిట్యుయేషన్ లాంటిదే. మరి పాత చింతకాయ పచ్చడి లాంటి ఈ కంటెంట్ తో నాగ శౌర్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తాడో చూడాలి.

కిరణ్ అబ్బవరం ‘నిర్మాత’ కష్టాలు.. టీవీ షో లాంటి సినిమాతో హిట్టు కొడతారా?

కిరణ్ అబ్బవరం ‘నిర్మాత’గా ఎలా?

ఇక రాజావారు రాణి వారు అంటూ ఎంట్రీ ఇచ్చి’ క’ సినిమాతో ప్రామిసింగ్ హీరోగా నిలబడ్డ కిరణ్ అబ్బవరం ఈ సారి ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. ‘తిమ్మరాజుపల్లి TV’ ట్రైలర్ చూస్తుంటే కథ మీద నమ్మకంతో కిరణ్ ఖర్చు బానే పెట్టినట్టు కనిపిస్తున్నాడు. అయితే 90ల నాటి విలేజ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఇప్పుడున్న ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చుతుందనేది పెద్ద ప్రశ్నే. అయితే మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్నారు కాని స్క్రీన్ మీద హీరో, హీరోయిన్ గా కనిపించబోతున్న కొత్త మొహాలు ఆడియన్స్ ని ఎంత వరకు థియేటర్లోకి లాక్కొస్తాయో 17న తేలిపోనుంది.

తిరువీర్ ‘పాపం ప్రతాప్’.. విలేజ్ లవ్ స్టోరీ భరించగలమా?

ఇక మసూద, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న తిరువీర్ నుండి వస్తున్న మరో సినిమా ‘పాపం ప్రతాప్’. ట్రైలర్ చూస్తుంటే మొగుడు పెళ్ళాల మధ్యలో జరిగే గొడవల చుట్టూ తిరిగే కథలా కనిపిస్తుంది. ఎమోషనల్ కామెడీగా కనిపిస్తున్న ట్రైలర్ కూడా కాస్త బజ్ క్రియేట్ చేస్తుంది. కాని ఇలాంటి ఈ విలేజ్ లవ్ స్టోరీల్లో మ్యాటర్ లేకపోతే ప్రేక్షకులు కనీసం థియేటర్ వైపు కూడా చూడరన్న సంగతి మేకర్స్ గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇది ott కోసం చేసి థియేటర్ లో వదులుతున్నారన్న టాక్ ఉంది. ఇలాగే సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని విషయంలో ఏం జరిగిందో బాగా తెలుసు. ప్రతాప్ ని పాపం అనకుండా ఉండాలంటే కంటెంట్ ఓ రేంజ్ లో సాటిస్ ఫై చేయాల్సిందే.

తిరువీర్ ‘పాపం ప్రతాప్’ కథాంశం

టొవినో థామస్ ‘పళ్లి చట్టంబి’.. డబ్బింగ్ కష్టాలు తప్పవా?

ఇక వీటితో పాటు ‘పళ్లి చట్టంబి’ అనే మలయాళ సినిమా కూడా ఈ వారమే బాక్సాఫీస్ వద్ద లక్ టెస్ట్ చేసుకోనుంది. అయితే తెలుగు సినిమాలు 17న వస్తుంటే ఈ సినిమా మాత్రం రెండు రోజుల ముందే .. అంటే 15నే థియేటర్లోకి రానుంది. నిజానికి ఇది ఏప్రిల్ 9న రిలీజ్ కావాల్సి ఉంది. ఇక మలయాళం సినిమాలు బాగా చూసేవారికి టొవినో థామస్ పరిచయమే అక్కర్లేదు. కాని ఆ పరిచయం టికెట్ ని తెంపుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉన్న ఈ సినిమాకి ప్రమోషన్స్ ఆ స్థాయిలో లేకపోవడమే.చూడాలి మరి ‘పళ్లి చట్టంబి’అంటూ వస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ఏ మేరకి బాక్సాఫీస్ ని కూల్ చేస్తుందో!

ఇక వీటన్నింటితో పాటు ‘తెరచాప’ అనే మరో చిన్న సినిమా క్యూలో ఉంది. అసలే చిన్న సినిమాలని ott లకే  పరిమితం చేసిన ఆడియన్స్ ని ఈ ‘తెరచాప’ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా వస్తున్న సినిమాలు వస్తున్నట్టే పోతున్న ఈ టైమ్ లో బాక్సాఫీస్ ఓ సాలిడ్ హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ తలరాత మారుస్తుందో చూడాలి.

చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనేది చూడాలి. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా నిలబడుతుందో, ఏది వెనుకబడుతుందో వేచి చూడాలి. ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.