|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీతారామం జంట మళ్లీ కలిసింది! తెరపై దుల్కర్, మృణాళ్.. వైరల్ వీడియో సంచలనం!

Published: 02-02-2026, 9:05 AM
సీతారామం జంట మళ్లీ కలిసింది! తెరపై దుల్కర్, మృణాళ్.. వైరల్ వీడియో సంచలనం!
  • దుల్కర్, మృణాళ్ జంటగా ‘బిగీ బిగీ’ ఆల్బమ్ సాంగ్ విడుదలైంది.
  • ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
  • పాటలో దుల్కర్, మృణాళ్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.
  • అభిమానులు వీరిద్దరూ వెండితెరపై మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు.

మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ జంట, ఇప్పుడు ‘బిగీ బిగీ’ అనే ఆల్బమ్ సాంగ్‌తో మళ్లీ సందడి చేస్తున్నారు. ఈ పాటలో వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు.

మళ్లీ సీతారామం జోడీ సందడి

Mrunal Dulquer Salmaan: మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ అంటేనే అందరికీ టక్కున సీతారామం(Sitaramam) సినిమా గుర్తుకు వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీత, రామ్ పాత్రలలో వీరిద్దరూ ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారని చెప్పాలి. ఇలా వెండితెర సీతగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాళ్(Mrunal Thakur) ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమల వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించి కథ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.

ఇటీవల వీరిద్దరూ ఒకే గొడుగు కింద ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కచ్చితంగా సీతారామం సినిమాకు సీక్వెల్ రాబోతుందని ఫోటో ద్వారా హింట్ ఇచ్చారని అభిమానులు అందరూ భావించారు కానీ అది నిజం కాదని స్పష్టం అవుతుంది. తాజాగా వీరికి జంటగా నటించిన ఒక ఆల్బమ్ సాంగ్ విడుదలైంది. ఇటయితే వాళ్ళ వైరల్ అయిన ఫోటో కూడా ఈ ఆల్బమ్ సాంగ్ కు సంబంధించినదని తెలుస్తోంది. మృణాళ్ , దుల్కర్ సల్మాన్(Dulquer Salman) మరోసారి జంటగా వెండితెరపై కాకుండా ఈ ఆల్బమ్ సాంగులో సందడి చేశారని స్పష్టమవుతుంది.

వైరల్ అవుతున్న ‘బిగీ బిగీ’ సాంగ్

తాజాగా ఈ బిగీ బిగీ(Bheegi Bheegi) అంటూ సాగిపోయే ఆల్బమ్ విడుదల చేయడంతో ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా రెహమాన్ కుమారుడు అమీర్, జస్లిన్ ఈ పాటను ఆలపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాట వినడానికి బానే ఉన్నప్పటికీ మళ్లీ మళ్లీ వినాలనిపించే అంత అద్భుతంగా అయితే లేదంటూ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ పాటలో ట్రైన్లో వెళ్తున్న దుల్కర్, మృణాళ్ ఒకరిని ఒకరు చూసుకోవడంతో వీరికి గత జన్మలో గుర్తుకు వస్తాయి అనే విధంగా విజువల్స్ చూయించారు. ఇక ఈ పాటలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక దుల్కర్ , మృణాళ్ ఇలా ఆల్బమ్ సాంగ్ లో కాకుండా వెండి తెరపై మరోసారి జంటగా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఇటీవల దుల్కర్ కాంత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన ఆకాశంలో ఒక తార అనే సినిమాలో చేస్తున్నారు. ఇక మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం అడివి శేష్ తో కలిసి డెకాయిట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ మార్చి 19వ తేదీ విడుదలకు సిద్ధమైంది. అప్పుడు కూడా ఈ సినిమా వాయిదా పడిపోతుంది అంటూ వార్తలు వస్తున్నా కానీ అధికారకు ప్రకటన మాత్రం లేదు.

వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఆశ

మొత్తానికి దుల్కర్, మృణాళ్ ఆల్బమ్ సాంగ్‌తో అలరించారు. అయితే, అభిమానులు మాత్రం వీరిద్దరిని వెండితెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కల నెరవేరుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.