|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధనుష్, మృణాల్: ఫిబ్రవరి 14న పెళ్లి పీటలెక్కనున్నారా? సంచలన నిజాలు!

Published: 15-01-2026, 11:00 PM
ధనుష్, మృణాల్: ఫిబ్రవరి 14న పెళ్లి పీటలెక్కనున్నారా? సంచలన నిజాలు!
  • ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
  • త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.
  • వచ్చే నెల 14న వీరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
  • గతేడాది మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ ఆమెతో ప్రేమగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ధనుష్, మృణాల్ డేటింగ్ రూమర్స్

Mrunal Thakur – Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళ హీరో అయిన కూడా తెలుగులో ఆయన సినిమాలు డబ్ అయ్యాయి. దాంతో పాటుగా ఈ మధ్య తెలుగు లో డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ఆయన డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. ఇప్పుడు పెళ్లి అంటూ మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.. నిజమేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం.

టాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఎంట్రీతోనే సూపర్ హిట్‌ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. ఈమె కేరెర్ సంగతి పక్కన పెడితే పెళ్లి పై గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో డేటింగ్‌లో ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఇ‍ద్దరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత మృణాల్ ధనుష్ సిస్టర్స్‌ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడంతో ఈ వార్తల్లో నిజముందని అభిప్రాయపడుతున్నారు..

సోషల్ మీడియాలో పెళ్లి వార్తలు

అంతేకాదు త్వరలోనే వీరిద్దరి పెళ్లి అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వచ్చేనెల 14న మృణాల్- ధనుశ్ ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ పాల్గొన్నారు. పార్టీ వీడియోలో ధనుష్ ఆమె చేతిని పట్టుకుని ఆమెతో ప్రేమగా మాట్లాడాడు.. దాంతో ప్రేమలో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే ఎవరొకరు క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే..

సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరోలందరితో జోడీ కట్టింది. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. ప్రస్తుతం యాక్షన్ చిత్రాల్లో నటిస్తుంది. అడివి శేష్ హీరోగా వస్తోన్న డకాయిట్ చిత్రంలో మెప్పించనుంది. ఈ సినిమా సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది..

మృణాల్ బర్త్ డే పార్టీలో ధనుష్

తెలుగులో కుబేర చిత్రంలో నటించారు. ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో ధనుష్ బిజీగా ఉన్నారు. హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు..

మొత్తానికి ధనుష్, మృణాల్ పెళ్లి వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.