|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజనీకాంత్ బయోపిక్: సంచలన ప్రకటన చేసిన సౌందర్య! వెండితెరపై తలైవా జీవిత కథ!!

Published: 28-01-2026, 11:05 AM
రజనీకాంత్ బయోపిక్: సంచలన ప్రకటన చేసిన సౌందర్య! వెండితెరపై తలైవా జీవిత కథ!!
  • రజినీకాంత్ బయోపిక్ త్వరలో తెరపైకి రానుంది.
  • సౌందర్య రజినీకాంత్ బయోపిక్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
  • రజినీకాంత్ సినీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
  • రజినీకాంత్ చివరిగా కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రముఖ నటుడు రజినీకాంత్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

రజినీకాంత్ బయోపిక్ గురించి సౌందర్య ప్రకటన

Rajinikanth Biopic: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ సినిమాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోనూ, రాజకీయ రంగంలోనూ, క్రీడా రంగంలో ప్రముఖుల వ్యక్తులకు సంబంధించిన బయోపిక్ సినిమాలు ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే మరొక సూపర్ స్టార్ బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. గత కొంతకాలంగా రజినీకాంత్ బయోపిక్ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ బయోపిక్ సినిమా కార్యరూపం దాల్చలేదు. అయితే త్వరలోనే ఈ బయోపిక్ సినిమా తెరపైకి రాబోతుందని తెలుస్తుంది. రజనీకాంత్(Rajinikanth) పెద్ద కుమార్తె సౌందర్య రజనీకాంత్ (Soundary Rajinikanth)ప్రస్తుతం దర్శకురాలిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె అభిమానులకు రజనీకాంత్ బయోపిక్ సినిమా గురించి గుడ్ న్యూస్ తెలియజేశారు . తన తండ్రి రజనీకాంత్ బయోపిక్ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. రజనీకాంత్ బయోపిక్ సినిమా ఎప్పుడు విడుదలైన ఆ సినిమా గ్లోబల్ స్థాయిలో మంచి ఆదరణను సొంతం చేసుకుంటుందని సౌందర్య రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కుమార్తెగా ఉండడం అంత తేలికైన విషయం కాదంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సౌందర్య తెలిపారు.

సామాన్యుడి నుండి సూపర్ స్టార్ వరకు రజినీకాంత్ ప్రస్థానం

ఇలా రజనీకాంత్ బయోపిక్ సినిమా గురించి ఈమె అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించి, బస్సు కండక్టర్ గా తన ప్రయాణాన్ని కొనసాగించారు అయితే సినిమాలపై ఆసక్తితో తన ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అవమానాలను , పరాజయాలను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా సక్సెస్ అందుకున్నారు. దాదాపు 5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ 170 పైగా సినిమాలలో నటించారు.

జైలర్ 2 పనులలో బిజీగా రజినీ..

రజినీకాంత్ సినీ జీవితం – ఒక స్ఫూర్తి

ప్రస్తుతం రజనీకాంత్ ఏడుపదుల వయసులో ఉన్నప్పటికీ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. రజనీకాంత్ సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర సినిమాగా రాబోతోందనే విషయం తెలిసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రజనీకాంత్ చివరిగా కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ 2 షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా 173 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

రజినీకాంత్ జీవిత చరిత్ర సినిమాగా రాబోతుండటం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రం రజినీకాంత్ సినీ జీవితంలోని అనేక కోణాలను ఆవిష్కరించనుంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.