|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mrunal Thakur: స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్.. బిగ్ అప్డేట్ ఇవ్వడంతో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Published: 17-06-2025, 7:04 AM
Mrunal Thakur: స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్.. బిగ్ అప్డేట్ ఇవ్వడంతో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సరసన ‘సన్ ఆఫ్ సర్దార్-2’లో నటించనున్నట్లు ప్రకటించింది. ఈ వార్తతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.

Key Points

1

మృణాల్ ఠాకూర్ ‘సన్ ఆఫ్ సర్దార్-2’లో అజయ్ దేవగన్ సరసన నటిస్తున్నారు.

2

యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమా జూలై 25న విడుదల కానుంది.

4

ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ కెరీర్ లో మరో మైలురాయి

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ‘సీతారామం’ చిత్రంతో వచ్చిన తన నటనతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత మరోసారి ‘హాయ్ నాన్న’ ఘన విజయం అందుకున్న ఈ భామ పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. గత ఏడాది ‘కల్కి’ (kalki) బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌కు చెక్కేసిన మృణాల్ వరుస సినిమాల్లో చాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే వరుణ్ ధావన్, పూజా హెగ్డే కాంబోలో రాబోతున్న హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే తెలుగులో ‘డెకాయిట్’ చిత్రంలో అడివి శేష్ సరసన హీరోయిన్‌గా చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్ ఠాకూర్ ఓ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

హిట్ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘సన్ ఆఫ్ సర్దార్-2’(Son of Sardaar-2)లో నటిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. క్లాప్ కొడుతున్నట్లుగా స్టిల్ ఇచ్చింది. యాక్షన్ సీన్స్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వావ్, సూపర్ లక్కీ చాన్స్ కొట్టేసిందని సూపర్ ఎక్జైటెడ్‌గా ఉన్నట్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ‘సన్ ఆఫ్ సర్దార్-2’లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తుండగా.. దేవ్‌గణ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే, అజయ్ నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో సంజయ్ దత్(Sanjay Dutt), సాహిల్ మెహతా, సంజయ్ మిశ్రా, రవికృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 25న విడుదల కాబోతున్నట్లు సమాచారం.

‘సన్ ఆఫ్ సర్దార్-2’ షూటింగ్ వివరాలు

ఫ్యాన్స్ ఆనందం

మొత్తంమీద, మృణాల్ ఠాకూర్ కెరీర్ లో ఇది మరో ముఖ్యమైన అడుగు. అజయ్ దేవగన్ సరసన నటించడం ఆమెకు మంచి అవకాశం. ‘సన్ ఆఫ్ సర్దార్-2’ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.