|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మృణాళ్ పెళ్లిపై సంచలన ప్రకటన! ఆ వ్యక్తి ఎవరంటే?

Published: 14-02-2026, 7:05 AM
మృణాళ్ పెళ్లిపై సంచలన ప్రకటన! ఆ వ్యక్తి ఎవరంటే?
  • మృణాళ్ ఠాకూర్ తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లను ఖండించారు.
  • సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని మృణాళ్ తెలిపారు.
  • ధనుష్‌తో మృణాళ్ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
  • తన పెళ్లి వార్తలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని మృణాళ్ చెప్పారు.

మృణాళ్ ఠాకూర్ తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి, నటుడు ధనుష్‌తో తన సంబంధం గురించి వస్తున్న పుకార్లను ఆమె ఖండించారు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపారు.

మృణాళ్ పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తలు

Mrunal thakur: మృణాళ్ ఠాకూర్ ఇటీవల కాలంలో తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా మృణాళ్ ఠాకూర్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సాధారణంగా ఒక హీరో హీరోయిన్ కాస్త చనువుగా ఉంటే వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇక ఈమె విషయంలో కూడా ఇలాంటి వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి.

మృణాళ్ ఠాకూర్ హీరో ధనుష్ తో రిలేషన్ లో ఉంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా వీరి పెళ్లి ఇదే అంటూ పెళ్లి గురించి కూడా ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.ఈ వార్తలపై ఎప్పటికప్పుడు మృణాళ్ ఠాకూర్ స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మృణాళ్ ఠాకూర్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. తాను అందరిలాగే పెళ్లి చేసుకుంటాను కాకపోతే దానికంటూ సమయం రావాలి. సరైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చినప్పుడు కచ్చితంగా తాను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెడతానని తెలిపారు.

ధనుష్‌తో రిలేషన్‌పై మృణాళ్ క్లారిటీ

నేను పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఈ విషయాన్ని నేనే స్వయంగా అందరికీ తెలియజేస్తాను. నా సోషల్ మీడియా అకౌంట్స్ లో నేనే పోస్ట్ చేస్తాను. నా పెళ్లి గురించి మీ అందరితో పంచుకునే మొదటి వ్యక్తిని నేనే అంటూ ఈమె తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని తెలియచేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక కోలీవుడ్ హీరో ధనుష్ మృణాళ్ ఠాకూర్ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ ఇటీవల ఈమె పుట్టినరోజు సందర్భంగా ధనుష్ హాజరుకావడమే కాకుండా వీరిద్దరూ కాస్త క్లోజ్ గా కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే రూమర్లు బయటకు వచ్చాయి. ఇక ధనుష్ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వడంతో రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేసిన ఈ వార్తలపై ధనుష్ ఎక్కడ స్పందించలేదు కానీ మృణాళ్ మాత్రం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.. మరి పెళ్లి గురించి మృణాళ్ చేసిన ఈ కామెంట్స్ ద్వారా అయినా ఈమె పెళ్లి రూమర్లకు చెక్ పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో అడవి శేష్ హీరోగా నటించిన డెకాయిట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతుంది. ఇక మార్చి 19 తేదీన విడుదల కాబోతుందని తెలిపారు కానీ మళ్ళీ కూడా వాయిదా పడుతుందని తెలుస్తోంది.

పెళ్లిపై మృణాళ్ తాజా కామెంట్స్

మృణాళ్ తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడానికి ప్రయత్నించారు. ఆమె ప్రకటనతో ఈ రూమర్లకు ముగింపు వస్తుందో లేదో చూడాలి. వ్యక్తిగత జీవితం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.