|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టీ ఎస్టేట్‌లో పులితో ముఖాముఖి: నటి సదా సాహసం చూస్తే షాక్ అవుతారు!

Published: 05-01-2026, 4:30 AM
టీ ఎస్టేట్‌లో పులితో ముఖాముఖి: నటి సదా సాహసం చూస్తే షాక్ అవుతారు!
  • నటి సదాకు వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం, తరచుగా అడవుల్లో జంతువులను చిత్రీకరిస్తారు.
  • తాజాగా ఒక టీ ఎస్టేట్‌లో పెద్దపులిని చూసిన సదా ధైర్యంగా దాని వీడియోను చిత్రీకరించారు.
  • పులి సదా వైపు చూసినా ఆమె భయం లేకుండా వీడియో తీయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
  • సదా షేర్ చేసిన ఈ సాహసోపేతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ప్రశంసలు అందుకుంటోంది.

నటి సదా వైల్డ్ ఫోటోగ్రఫీపై తనకున్న ఆసక్తిని చాటుకుంటూ ఎన్నో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు పంచుకుంటారు. తాజాగా ఆమె ఒక టీ ఎస్టేట్‌లో పులిని చూసి, ధైర్యంగా చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సాహసం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

సదా వైల్డ్ ఫోటోగ్రఫీ అభిరుచి

Actress Sada:సాధారణంగా ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో అభిరుచులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ వారి అభిరుచులకు అనుగుణంగా జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లుగా కొనసాగుతూనే మరోవైపు వారికి నచ్చిన వృత్తిలో కొనసాగుతూ ఉంటారు. ఇలా చాలామంది హోటల్ బిజినెస్, క్లోతింగ్ బిజినెస్ అంటూ ఇప్పటికే ఎన్నో వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీనటి సదా సైతం చాలా విభిన్నంగా వైల్డ్ ఫోటోగ్రఫీ(Wild Photography)ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

జంతువులంటే ఎంతో విపరీతమైన ప్రేమ అభిమానం ఉన్న సదా ప్రస్తుతం సినిమాలలో నటించలేదు అయితే ఈమె మాత్రం కెమెరా చేత పట్టుకొని అడవులు బాట పడుతూ ఎన్నో అద్భుతమైన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సదా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాధారణంగా పెద్దపులి ఎదురు పడుతుందంటే మనం అక్కడి నుంచి భయంతో పరుగులు పెట్టడం చేస్తాం.కానీ సదా మాత్రం ధైర్యంగా పెద్దపులి కనిపించేసరికి అందుకు సంబంధించిన వీడియోని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టీ ఎస్టేట్‌లో పులితో సాహసోపేతమైన ఎదురుచూపు

ఒక టీ ఎస్టేట్ లో పెద్దపల్లి సంచరిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇది కాస్త సదా కంటపడటంతో ఆమె దూరం నుంచి ఆ పులికి సంబంధించిన వీడియోని చిత్రీకరించారు. అయితే ఒక్కసారిగా ఆ పెద్దపులి సదా వైపు చూసినప్పటికీ ఆమె భయపడకుండా ఈ వీడియోని చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదా గుండె ధైర్యం పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన ఈమె ఇలాంటి క్రేజ్ ఎక్స్పీరియన్స్ తన ఎప్పుడు చేయలేదని తెలిపారు. మొదటిసారి తాను ఈ ప్లేస్ కు వచ్చినప్పుడు చిరుత పులి ఈ టీ ఎస్టేట్లో ఎంజాయ్ చేస్తూ కనిపించిందని, ఇంకేమి అడగలేక పోయాను అంటూ ఈమె షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఇక సదా షేర్ చేసిన ఈ వీడియో పై అభిమానులు స్పందిస్తూ చాలా అద్భుతంగా ఉంది, గ్రేట్ అడ్వెంచర్ అంటూ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక సదా కెరియర్ విషయానికి వస్తే సౌత్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. జయం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన సదా మొదటి సినిమా తోనే సక్సెస్ కావడంతో అనంతరం తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారు. ఇక తదుపరి ఈమె నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆదరణ నోచుకోలేకపోవడంతో మెల్లిమెల్లిగా అవకాశాలను కోల్పోతూ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెరపై మాత్రం పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. బుల్లితెర కార్యక్రమాలలో మాత్రమే కాకుండా డాన్స్ షోలకు సదా జడ్జిగా వ్యవహరిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

అభిమానుల ప్రశంసలు, కెరీర్ ముఖ్యాంశాలు

సదా ప్రదర్శించిన ఈ సాహసం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వైల్డ్ ఫోటోగ్రఫీలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె ధైర్యాన్ని, జంతువులపై ప్రేమను ఈ వీడియో మరోసారి రుజువు చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.