|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

MSVG కలెక్షన్ల సునామీ! మెగాస్టార్ చిరంజీవి రికార్డుల ఊచకోత! ఫస్ట్ డే షాకింగ్ వసూళ్లు!

Published: 13-01-2026, 12:19 AM
MSVG కలెక్షన్ల సునామీ! మెగాస్టార్ చిరంజీవి రికార్డుల ఊచకోత! ఫస్ట్ డే షాకింగ్ వసూళ్లు!
  • మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్: మేకర్స్ అధికారిక ప్రకటన!
  • మొదటి రోజు ఏకంగా రూ.84 కోట్ల భారీ వసూళ్లు రాబట్టిన మెగాస్టార్ సినిమా!
  • సోమవారం ఒక్కరోజే రూ.65 కోట్లకు పైగా వసూళ్లు.. రికార్డు బ్రేకింగ్!
  • చిరంజీవి కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే అవకాశం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం!

ఫస్ట్ డే కలెక్షన్స్: రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మెగా మూవీ మన శంకర వరప్రసాద్ గారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.

చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టా?

తాజాగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వారి లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.84 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. అందులో, సోమవారం ఒక్కరోజే రూ.65 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఇక ప్రీమియర్స్ ద్వారా రూ.15 కోట్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా. నిజానికి, మెగా అభిమానులు మాత్రం ఈ సినిమా ఫస్ట్ డే ఖచ్చితంగా రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తుంది అని ఆశపడ్డారు.

రూ.100 కోట్ల టార్గెట్ మిస్.. కారణమిదే!

కానీ, అది జరగ లేదు. దానికి కారణం ఈ సినిమా సోమవారం విడుదల కావడం. వీకెండ్ లో రిలీజ్ అయుంటే ఈ లెక్క ఒక రేంజ్ లో ఉండేది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే, మరోపక్క ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ ఉంది థియేటర్స్ లో. కాబట్టి, ఆ దెబ్బ కూడా పడింది అని చెప్పాలి. అయినప్పటికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటిరోజు రికార్డ్ లెవల్లో వసూళ్లు సాధించింది అనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ లెక్క మరింతంగా పెరిగే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే హైయ్యెస్ట్ నంబర్స్ కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ కలక్షన్స్ రాబడుతుంది అని.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.