
📌 Key Points
- చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం.
- ఈ సినిమా సంక్రాంతికి విడుదలై 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
- జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టెలివిజన్ లో ప్రసారం కానుంది.
- వెంకటేష్, నయనతార, కేథరిన్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం త్వరలో టెలివిజన్ లో ప్రసారం కానుంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. జీ సంస్థ ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ ప్రోమోను విడుదల చేసింది.
థియేటర్లలో విజయం, ఓటీటీలో సందడి!
MSVPG Film: టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తాజాగా నటించిన చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు(MSVPG) అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో సుమారు 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో విజయవంతంగా ప్రసారమవుతున్న ఈ సినిమా టెలివిజన్ ప్రసారానికి కూడా సిద్ధమైంది .తాజాగా జీ సంస్థ వారు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కి సంబంధించి ఒక ప్రోమోని విడుదల చేశారు. ఇందులో భాగంగా త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాబోతుందని తెలియజేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చింది అయితే ఓటీటీలోకి వచ్చిన నెల రోజులలోపే టెలివిజన్ ప్రీమియర్ కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
టెలివిజన్ ప్రీమియర్ ప్రోమో విడుదల
ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడంతో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ హిట్ అందించారని చెప్పాలి. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత చిరంజీవిని ఇలాంటి పాత్రలో చూసిన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) కూడా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
వెంకీ గౌడ అనే పాత్రలో వెంకటేష్ క్యామియో సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా కేథరిన్ కూడా నటించి సందడి చేశారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో మెగా అభిమానులు అలాగే చిత్రబృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిరంజీవి ఏకంగా డైరెక్టర్ అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పై సాహుగారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
చిరంజీవి, వెంకటేష్ ల మల్టీస్టారర్
‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం థియేటర్ మరియు ఓటీటీలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మెగా అభిమానులకు ఇది నిజంగా పండుగలాంటి వార్తే.


