|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి సినిమాపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు! ఇంత సాహసమా?

Published: 26-02-2026, 6:35 AM
చిరంజీవి సినిమాపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు! ఇంత సాహసమా?
  • చిరంజీవి నటనను పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు.
  • ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా వసూలు చేసింది.
  • దర్శకుడు అనిల్ రావిపూడిని పరుచూరి అభినందించారు.
  • చిరంజీవి ఎనర్జీ, స్టెప్పులను పరుచూరి కొనియాడారు.

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

పరుచూరి గోపాలకృష్ణ సినిమా రివ్యూ

MSVPG Film: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలలో కూడా అదే ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. ఈ సందర్భంగా పరుచూరి టాక్స్ ద్వారా గోపాలకృష్ణ మన శంకర వరప్రసాద్ గారు సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా టైటిల్ వినడానికి చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోని పెట్టి యాక్షన్ లేకుండా కామెడీ సినిమా చేయటం అంటే సాహసమే అని చెప్పాలి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత యాక్షన్ కామెడీ సినిమా అని తెలుస్తుంది. సినిమా మొదలైన తర్వాత మొదటి సన్నివేశంలోనే హీరో ఏంటీ? తన గతం ఏంటి అనే విషయాలను అద్భుతంగా చూపించారు. హీరో భార్యకు దూరంగా ఉండడం అలాగే తన భార్యకు దూరంగా ఉన్నప్పటికీ వారికి కష్టం వస్తే హీరో ఎలా కాపాడారనే సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.

చిరంజీవి నటనపై ప్రశంసలు

ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ కేథరిన్ పాత్ర కూడా అద్భుతంగా ఉందని హీరో కామెడీ టీమ్ లో ఈమెను ఎందుకు పెట్టారనే సందేహం మొదట్లో కలిగిన చివరిలో వెంకటేష్ ను పెళ్లి చేసుకోవడం ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో మధ్య మధ్యలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి అద్భుతమైన సినిమాని చేసినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడిని అభినందించాల్సిందేనని, చిరంజీవి గారికి చిన్న సెల్యూట్ చేయాల్సిందే.

ఇప్పటికీ అదే ఎనర్జీ.. అవే స్టెప్పులు..

సినిమా సాధించిన కలెక్షన్ల వివరాలు

చిరంజీవిలో ఇప్పటికీ అదే ఎనర్జీ, అవే స్టెప్పులు, అవే మూమెంట్స్.. ఎక్కడ ఎలాంటి తేడా లేదు చిరంజీవి అంటే మా చిరంజీవి అనిపించుకున్నారంటూ ఈ సినిమా పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ పరుచూరి గోపాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో ఏ సినిమా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి సినిమాలపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బాబి డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.

పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రాబోయే సినిమాలపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.