|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ కృష్ణ మూవీ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూత

Published: 24-05-2025, 3:11 AM
రవితేజ కృష్ణ మూవీ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూత

ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూశారు. రవితేజ ‘కృష్ణ’ సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రభాస్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. 54 ఏళ్ల వయసులో ఆయన మరణించడం సినీ ప్రియులను కలచివేసింది.

Key Points

1

కృష్ణ సినిమా విలన్ ముకుల్ దేవ్ కన్నుమూశారు.

2

54 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.

4

బాలీవుడ్, దక్షిణాది సినిమాల్లో పలు పాత్రలు పోషించారు.

ముకుల్ దేవ్ మరణం

మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ త్రిష జంటగా నటించిన యాక్షన్ కామెడీ సినిమా కృష్ణ. ఈ సినిమాలో జక్కా అనే విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తుండిపోయారు ముకుల్ దేవ్. 54 ఏళ్ల వయసులో ముకుల్ దేవ్ కన్నుమూశారు. దీంతో బాలీవుడ్‌తోపాటు పలు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.

హిందీతోపాటు, పంజాబీ, తెలుగు వంటి పలు దక్షిణాది చిత్రాల్లో మంచి పాత్రలతో అలరించారు ముకుల్ దేవ్. అలాగే, బుల్లితెరపై కూడా పలు విభిన్న రోల్స్ చేసి ఆకట్టుకున్నారు. అయితే, 54 ఏళ్ల వయసులో చనిపోయిన ముకుల్ దేవ్ మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

ముకుల్ దేవ్ మరణాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆయన సోదరుడు విందూ దారా సింగ్ ట్వీట్ చేశారు. “నా సోదరుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సన్ ఆఫ్ సర్దార్ 2తో ఆడియెన్స్‌కు వినోదాన్ని పంచి, వారిని నవ్వించిన సినిమా” అని ముకుల్ దేవ్ సోదరుడు రాసుకొచ్చారు.

తెలుగు సినిమాల్లో ముకుల్ దేవ్

ముకుల్ దేవ్ మరణాన్ని ధృవీకరిస్తూ ఇండియా టుడేతో మాట్లాడారు ఆయన సోదరుడు విందూ దారా సింగ్. “తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ముకుల్ నా వద్దే ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఎవరినైనా కలిసేవాడు. గత కొన్ని రోజులుగా ముకుల్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. నా సోదరుడిని ప్రేమించిన ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ముకుల్ చాలా అద్భుతమైన వ్యక్తి. మేమంతా కచ్చితంగా ముకుల్‌ని మిస్ అవుతాం” అని విందూ సింగ్ చెప్పారు.

ఇదిలా ఉంటే, ముకుల్ దేవ్ 17 సెప్టెంబరు 1970 న్యూఢిల్లీలో జన్మించారు. హిందీ, పంజాబీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళ చిత్రాలతో పాటు టెలివిజన్ సీరియల్స్‌లో ముకుల్ దేవ్ నటించారు. 1996లో ముంకిన్ అనే టీవీ సీరియల్‌తో ముకుల్ దేవ్ తన కెరీర్‌ను ప్రారంభించారు.

ఆయన సినిమా జీవితం

అదే సంవత్సరం దస్తక్‌లో సుస్మితా సేన్‌తో కలిసి యాక్ట్ చేశారు ముకుల్ దేవ్. హిందీలో యమ్లా పగ్లా దీవానా, సన్ ఆఫ్ సర్దార్, ఆర్.. రాజ్ కుమార్, జై హో వంటి సినిమాల్లో నటించారు.

ముకుల్ దేవ్ రవితేజ కృష్ణ సినిమాతోపాటు నిప్పు, ప్రభాస్ ఏక్ నిరంజన్, జగపతి బాబు సిద్ధం, నేనే కేడీ నెం 1, జేడీ చక్రవర్తి మనీ మనీ మోర్ మనీ, నాగార్జున భాయ్, తనీష్ దేశదిమ్మరి వంటి మూవీస్‌లో నటించారు.

ముకుల్ దేవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన నటన ప్రతిభను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.