|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ముఖంపై ఈ 4 చోట్ల పుట్టుమచ్చలు: అదృష్ట సంకేతాలు?

Published: 20-05-2025, 4:21 AM
ముఖంపై ఈ 4 చోట్ల పుట్టుమచ్చలు: అదృష్ట సంకేతాలు?

సాముద్రిక శాస్త్రం ప్రకారం, ముఖంపై పుట్టుమచ్చలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయి. ఈ కథనంలో ముఖంపై నాలుగు ప్రత్యేకమైన చోట్ల పుట్టుమచ్చలు ఉండటం వల్ల కలిగే అదృష్టాన్ని తెలుసుకుందాం.

Key Points

1

నుదిటిపై పుట్టుమచ్చ: ప్రశాంతత, తెలివితేటలు, అదృష్టం.

2

పెదవులపై పుట్టుమచ్చ: అందం, మధురమైన మాటలు, ప్రేమ.

4

బుగ్గలపై పుట్టుమచ్చ: విభిన్నత, సంతోషకరమైన వైవాహిక జీవితం, సృజనాత్మకత.

నుదిటిపై పుట్టుమచ్చల అర్థం

సాముద్రిక శాస్త్రం ద్వారా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టుమచ్చలు ఆధారంగా మనిషి ప్రవర్తన, భావాలు, భవిష్యత్తు, అదృష్టం, లాభాలు వంటి విషయాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా మనకి శరీరంపై అనేక పుట్టుమచ్చలు ఉంటాయి.

ముఖంపై కూడా చాలా మందికి ఎక్కువగా పుట్టుమచ్చలు ఉంటాయి. అయితే, ఈరోజు ముఖం పై ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా అవి తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీ పుట్టుమచ్చల వెనుక ఉన్న రహస్యం తెలుసుకోండి.

ముఖంపై ఉన్న పుట్టుమచ్చలు వెనుక అర్ధం ఏంటో తెలుసుకోండి

పెదవులు, ముక్కుపై పుట్టుమచ్చలు

ముఖంపై ఉన్న పుట్టుమచ్చలు అందంగా కనపడేలా చేస్తాయి. ముఖం పై ఉన్న పుట్టుమచ్చులు ద్వారా భవిష్యత్తు , భావాలు, అదృష్టం ఇలా అనేక విషయాలని తెలుసుకోవచ్చు.

సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటిపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావించడం జరిగింది. నుదిటిపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు ప్రశాంతంగా ఉంటారు. ఈ వ్యక్తులు తెలివైన వారు కూడా. ఈ పుట్టుమచ్చ వారి అదృష్టాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వ్యక్తులు ఎక్కువగా కష్టపడి పని చేసి, గుర్తింపును తెచ్చుకుంటారు.

పెదవులు పై పుట్టుమచ్చ ఉన్నట్లయితే మీరు చాలా అందంగా ఉంటారు. బాగా మాట్లాడుతారు. మీ మాటలు కూడా మధురంగా ఉంటాయి. మీరు భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. ఎంతో సపోర్ట్ ఇస్తారు. కుటుంబంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.

బుగ్గలపై పుట్టుమచ్చల ప్రభావం

అదే ఒకవేళ ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే దీనిని అదృష్టం గా భావిస్తారు. ఈ పుట్టుమచ్చ ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒకరికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంతో కష్టపడి పని చేస్తారు.

అదే ఒకవేళ బుగ్గలపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం మీరు ఇతరులతో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఇతరుల హృదయాలని ఎప్పుడూ గెలుచుకుంటూ ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ సమాచారం సాముద్రిక శాస్త్రం ఆధారంగా మాత్రమే. ఖచ్చితత్వం గురించి మేము హామీ ఇవ్వలేము. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.