
ప్రతి వారం ఓటీటీలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతున్నాయి. ఈ వారం సౌత్ ఇండస్ట్రీ నుంచి, ముఖ్యంగా తెలుగులో అనేక ఆసక్తికరమైన చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో ఉత్తమమైన ఐదు చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Key Points
జీ5లో విడుదలైన 'విరాటపాలెం-పీసీ మీనా రిపోర్టింగ్' వెబ్ సిరీస్ చూడండి.
అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న 'యుద్ధకాండ ఛాప్టర్ 2' లీగల్ థ్రిల్లర్ చూడండి.
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం ఫ్యామిలీ డ్రామా 'పరివార్' చూడండి.
జియోహాట్‌స్టార్‌లో 'ది కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2' చూడండి.
విరాటపాలెం-పీసీ మీనా రిపోర్టింగ్
ఓటీటీల్లోకి ప్రతి వారం చాలా సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. అయితే ఈవారం సౌత్ ఇండస్ట్రీ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, సిరీస్ రానున్నాయి. వాటిలో మూడు తెలుగులోనే స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాటిలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
విరాటపాలెం-పీసీ మీనా రిపోర్టింగ్ – జీ5 ఓటీటీ
ఓటీటీ లోకి ఈవారం తెలుగు వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ వస్తోంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకరాలాంటి వాళ్లతో జీ5 ఈ కొత్త తెలుగు సిరీస్‌ను తీసుకువస్తోంది. ఇందులో అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతంలో డ్యూటీ కోసం వెళ్లే ఒక మహిళా పోలీసు చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఆ గ్రామంలో కొత్త వధువులు తమ పెళ్లిరోజునే కన్నుమూస్తుంటారు. దీని వెనుక ఉన్న రహస్యాన్ని మీనా ఛేదించే ప్రయత్నం చేస్తుంది. ఏడు ఎపిసోడ్‌ల ఈ పోలీస్ సిరీస్ జూన్ 27న రానుంది.
యుద్ధకాండ ఛాప్టర్ 2
యుద్ధకాండ ఛాప్టర్ 2 – ప్రైమ్ వీడియో
కన్నడ లీగల్ థ్రిల్లర్ మూవీ యుద్ధకాండ ఛాప్టర్ 2 ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. కోర్టు ముందే పట్టపగలు ఓ ఎమ్మెల్యే తమ్ముడిని హత్య చేసే మహిళ చుట్టూ తిరిగే మూవీ ఇది. కేజీఎఫ్ ఫేమ్ అర్చన జోయిస్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించింది. అజయ్ రావ్ లీడ్ రోల్లో నటించాడు. మంచి లీగల్ డ్రామా చూడాలనుకుంటే ఈ యుద్ధకాండ ఛాప్టర్ 2ను చూడొచ్చు.
మలయాళం ఫ్యామిలీ డ్రామా పరివార్ మంగళవారం (జూన్ 24) ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఆ కుటుంబంలో ఓ పెద్దాయన కన్నుమూసే పరిస్థితుల్లో ఉంటాడు. అతని ఇద్దరు కొడుకులు ఆ పెద్దాయన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్ కోసం చూస్తుంటారు. వాళ్ల ఫైట్ మంచి నవ్వులు పంచుతుంది.
ది కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 – జియోహాట్‌స్టార్
పరివార్ & ది కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2
ది కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ సీజన్ 2 జియోహాట్‌స్టార్ లోకి గతవారమే స్ట్రీమింగ్ కు వచ్చింది. రెండేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. ఈ రెండో సీజన్ మరింత రక్తి కట్టించింది. కనిపించకుండా పోయిన ఓ పోలీసు కోసం సాగే వేట చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
జిన్ ద పెట్ – సన్ నెక్ట్స్
జిన్ ద పెట్ ఓ తమిళ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా శక్తి అనే మ్యుజీషియన్, అతని దగ్గర ఓ పెట్టె చుట్టూ తిరుగుతుంది. ఆ పెట్టెలోని అతీత శక్తి వల్లే అతని ఇంట్లో కొన్ని ఊహించని ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. సన్ నెక్ట్స్ ఓటీటీలో మూవీ అందుబాటులో ఉంది.
ఈ వారం ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం. మీకు నచ్చిన సినిమా గురించి కామెంట్ చేయండి!


