
📌 Key Points
- మై విలేజ్ షో నుండి సంచలన ప్రకటన: అనిల్ జీలా ఇక లేరు!
- 3.14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్‌లో ఊహించని విభేదం
- అనిల్ జీలా సొంత యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్లు, ఇకపై మై విలేజ్ షోకు సంబంధం లేదు
- లంబాడి పల్లె యువకుల కలల ప్రయాణంలో అనూహ్య ముగింపు!
తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్! మై విలేజ్ షో నుండి అనిల్ జీలా వైదొలిగారు. ఈ సంచలన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ‘మై విలేజ్ షో’
యూట్యూబ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీలు అవుతున్న సంగతి తెలిసిందే. మారుమూల గ్రామాలలో వీడియోలు చేసి, యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడమే కాకుండా, కొంత మంది సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అచ్చం అలాగే ‘మై విలేజ్ షో ‘ ( my village show) యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఫేమస్ అయింది అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ యాష, భాష ఒట్టి పడేలా ‘మై విలేజ్ షో’ ఛానెల్ లో వీడియోలు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లంబాడి పల్లె గ్రామానికి చెందిన కొంత మంది యువకులు శ్రీకాంత్, అనిల్ జీలా, శివకృష్ణ ఈ ఛానల్ ఏర్పాటు చేశారు. 2012లో ఈ ఛానల్ ప్రారంభించినప్పటికీ, 2018లో చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఛానల్ 3.14 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఛానల్ కు మంచి ఆదరణ కూడా వస్తోంది.
అద్భుతంగా నడుస్తున్న ‘మై విలేజ్ షో” లో చీలిక ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అధికారికంగా అనిల్ జీలా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానల్ బృందం.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరి ప్రకటించింది. ఇక నుంచి అనిల్ కు తమ ఛానల్ కు ఎలాంటి సంబంధం ఉండబోదని వెల్లడించింది మై విలేజ్ షో టీమ్. ఇప్పటికే అనిల్ జీలా యూట్యూబ్ ఛానల్ సొంతంగా నడిపించుకుంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
అనిల్ జీలా నిష్క్రమణ: కారణాలు ఏమిటి?
ఈ తరుణంలోనే ‘మై విలేజ్ షో’ బృందానికి, అనిల్ కు ( anil geela ) గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అనిల్ వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మై విలేజ్ షో కూడా అధికారిక ప్రకటన చేసింది. ఇకపై అనిల్ జీలా చేసే ప్రమోషన్లు, ఆయన వ్యాపారాలకు ‘మై విలేజ్ షో’ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది టీమ్. ‘మై విలేజ్ షో’ పేరుతో ఎవరైనా సంప్రదిస్తే, తమ అధికారిక సోషల్ మీడియాల ద్వారా సమాచారం ఇవ్వండి అని పేర్కొంది టీమ్. ఎవరినీ నమ్మ మోసపోకండి అని కోరింది.
మై విలేజ్ షో టీమ్ ప్రకటన: పూర్తి వివరాలు
A post shared by My Village Show (@myvillageshow)
మై విలేజ్ షోలో చోటు చేసుకున్న ఈ పరిణామం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.


