
📌 Key Points
- “మిస్టీరియస్” చిత్రం క్రైమ్, లవ్, థ్రిల్లింగ్ అంశాలతో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కింది.
- కిల్లర్ ఎవరు అనేది చివరి వరకు సస్పెన్స్, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు హైలైట్.
- ఎంఎల్ రాజా సంగీతంలో మూడు పాటలు, ఓ అద్భుతమైన ఫైట్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
- ‘అఖండ 2’ కారణంగా ఆలస్యంగా అక్టోబర్ 19న 150కి పైగా థియేటర్లలో విడుదల కానుంది.
మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన “మిస్టీరియస్” చిత్రం ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు సిద్ధమైంది. సస్పెన్స్, క్రైమ్, లవ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్‌తో అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ నెల 19న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
సస్పెన్స్, థ్రిల్‌తో “మిస్టీరియస్” మూవీ
‘మిస్టీరియస్’ సినిమాను రెగ్యులర్ ఫార్మాట్‌తో కాకుండా.. విభిన్నమైన పాయింట్‌తో తెరకెక్కించామని తెలిపారు ఆ చిత్ర దర్శకుడు మహి కోమటిరెడ్డి. ఈ సినిమాలో క్రైమ్‌తో పాటు లవ్, క్రష్ ఉంటాయని.. థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉంటాయని.. ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్ అవుతారని తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలను ఏ సినిమాలోనూ చూపించలేదన్నారు. కిల్లర్ ఎవరు అనేది చివరి వరకు సస్పెన్స్‌గానే సాగుతుందని.. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరూ ఊహించని విధమైన ఓ ట్విస్ట్‌తో సస్పెన్స్ ప్లస్ థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. సినిమా అయిపోయక అందరూ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునేలా ఉండబోతుందని చెప్పారు. థ్రిలర్ మూవీస్ అంటే.. పాటలు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు కానీ తమ సినిమాలో కథను బట్టి మూడు పాటలు పెట్టడం జరిగిందన్నారు. ఈ మూడు పాటలు కూడా సరిగ్గా సరిపోయాయని.. ప్రేక్షకుడు మొత్తం క్రైమ్ సినిమానే చూస్తున్నాడు అనే ఫీల్ రాకుండా.. ప్రేక్షకుడు డిస్టర్బ్ అవ్వకుండా.. మధ్యలో వచ్చే పాటలు కూడా మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయన్నారు. ఆ పాటలకు తమ సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా ఛాట్ బస్టర్ మ్యూజిక్ అందించారన్న ఆయన.. పోలీసుల గొప్పదనం చెప్పేలా రూపొందించిన ‘అడుగు అడుగునా’ సాంగ్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో రిలీజ్ చేయించామన్నారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని.. పాటలతో పాటు ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందన్న ఆయన.. ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. ‘అఖండ 2’ రిలీజ్ కారణంగా ఒక వారం ఆలస్యంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు. 150 థియేటర్స్‌కు పైగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామని.. ఈ మధ్యే మా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుపుకున్నామని తెలిపారు.
క్లైమాక్స్ ట్విస్ట్‌తో మెప్పించనున్న మహి కోమటిరెడ్డి
విడుదల తేదీ, పాటలు, ఫైట్ సీన్ విశేషాలు
మొత్తంగా, “మిస్టీరియస్” సినిమా విభిన్నమైన కథాంశం, థ్రిల్లింగ్ అంశాలు, ముఖ్యంగా ఊహించని క్లైమాక్స్‌తో ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచనుంది. అక్టోబర్ 19న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూడవచ్చు.


