
అందాల రాక్షసితో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర, ‘లెవెన్’ అనే లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సిఫార్సుతో విలన్ పాత్రను పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Key Points
నవీన్ చంద్ర లేటెస్ట్ సినిమా 'లెవెన్' మే 16న విడుదల.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన బైలింగువల్ మూవీ.
రవితేజ సిఫార్సుతో 'లెవెన్' లో విలన్ పాత్ర.
ఎనిమిది భాషలు తెలిసిన నవీన్ చంద్ర స్వయంగా డబ్బింగ్ చెప్పారు.
‘లెవెన్’ సినిమా విశేషాలు
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అలరించాడు. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో యాక్ట్ చేసి నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పరంపర, ఇన్‌స్పెక్టర్ రిషి వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యాడు.
ఇటీవలే 28 డిగ్రీ సెల్సియస్ సినిమాతో అలరించిన హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరించిన ఈ సినిమాకు కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు.
లెవెన్ సినిమా మే 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో లెవెన్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విశేషాలను హీరో నవీన్ చంద్ర తెలిపాడు.
రవితేజతో నవీన్ చంద్ర అనుభవం
-అవును. రెండు భాషల్లో డిఫరెంట్ డిఫరెంట్ షాట్స్ తీశాం. స్క్రిప్ట్‌ని కూడా ట్రాన్స్‌లేట్ చేయలేదు. తెలుగు నుంచి ప్రత్యేకంగా రైటర్‌తో రాయించి తెలుగు స్క్రిప్ట్‌తో షూట్ చేశాం. నిర్మాతలు ఎక్కడ రాజీపడకుండా ఖర్చు చేశారు.
-తెలుగు తమిళ్ బైలింగువల్ చేయడం ఇప్పుడు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాను. ఈ సినిమాకి తమిళ్ డబ్బింగ్ నేనే చెప్పాను. నాకు ఎనిమిది భాషలు వచ్చు. నా అన్ని సినిమాలకి ప్రతి భాషలో నేనే డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాను.
-బిగినింగ్ డేస్లో ఒక క్యారెక్టర్ నుంచి బయటపడటం నాకూ కొంచెం సమస్యగానే ఉండేది. షూటింగ్ తర్వాత కూడా ఆ క్యారెక్టర్‌ని ఇంటి వరకూ తీసుకెళ్లే వాడిని. అయితే పెళ్లి తర్వాత దాన్ని మెల్లమెల్లగా మానుకున్నాను. షూటింగ్‌లో ఉన్నంత వరకే డైరెక్టర్ డిజైన్ చేసే క్యారెక్టర్‌లో ఉంటాను. తర్వాత స్విచ్ అఫ్ చేసేస్తాను.
నవీన్ చంద్ర భవిష్యత్ ప్రాజెక్టులు
– రవితేజ గారికి విలన్‌గా చేయాలని సితార నుంచి కాల్ వచ్చింది. రిఫర్ చేసింది కూడా రవితేజ గారే. అరవింద సమేతలో నా క్యారెక్టర్‌ని ఎలా యూనిక్గా ఫీల్ అయ్యారో.. అంతే యూనిక్‌గా ఈ సినిమాలో ఉంటుంది. నా లుక్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అందుకే విలన్ రోల్ చేశా. నా ప్రతి సినిమాకి పది మంది ఆడియన్స్ అయినా పెరగాలనే ఉద్దేశంతో అన్ని రకాల పాత్రలు చేస్తున్నాను.
-హానీ అనే సినిమా జరుగుతోంది. చాలా డార్క్ సినిమా అది. చాలా కొత్తగా ఉంటుంది. అలాగే, కాళీ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్‌లో ఓ సినిమా జరుగుతోంది. అలాగే హరి అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. అది కామెడీ ఫిలిం. ఫస్ట్ టైం కామెడీ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
నవీన్ చంద్ర తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, అనేక భాషల్లో డబ్బింగ్ చెప్పడం ద్వారా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ‘లెవెన్’ సినిమాతో మరింత విజయం సాధించాలని ఆశిద్దాం.


