|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నదివే సాంగ్ లిరిక్స్.. రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్‌లోని రొమాంటిక్ మెలోడీ పాట.. మనసుకు హత్తుకునేలా సాహిత్యం!

Published: 17-07-2025, 2:42 AM
నదివే సాంగ్ లిరిక్స్.. రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్‌లోని రొమాంటిక్ మెలోడీ పాట.. మనసుకు హత్తుకునేలా సాహిత్యం!

రష్మిక మందన్న మరియు దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నుండి ‘నదివే’ అనే రొమాంటిక్ పాట లిరిక్స్ విడుదలయ్యాయి. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట మనసుకు హత్తుకునేలా ఉంది.

Key Points

1

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా నుంచి 'నదివే' సాంగ్ లిరిక్స్ రిలీజ్.

2

ఐదు భాషల్లో విడుదలైన ఈ రొమాంటిక్ మెలోడీ పాట మనసుకు హత్తుకునేలా ఉంది.

4

చిత్రీకరణ తుది దశలో ఉన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

‘నదివే’ పాట లిరిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు, హీరో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా నుంచి తాజాగా నదివే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. రొమాంటిక్ మెలోడీగా సాగే నదివే సాంగ్‌ను హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో రిలీజ్ చేశారు.

మనసుకు హత్తుకునే సాహిత్యంతో సాగేలా, రష్మిక , దీక్షిత్ కెమిస్ట్రీతో అట్రాక్ట్ చేసేలా ఉంది ఈ నదివే సాంగ్. మరి ఈ నదివే సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

వెలుగారునా.. నిశిపూసినా..

వెలివేసినా.. మది వీడునా..

గుండె కన్నుమూసిన విధి రాసిన కల కాలిపోవు నిజమైన

నిన్ను వదలకుమా వదలకుమా.. బెదురెరుగని బలమా..

నీ మార్పే రానుంది వినవే..

నీకే నువ్వియ్యాలి విలువే..

‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా విశేషాలు

వెన్నెల వలదను కలువవు నువ్వు కావా.. కాలేవా..

ఓహో హో.. తడువు గురుతులై ఇలా..

ఎటు కదలనీ నిమిషం నులిమిన గొంతుకవా

నటనిక చాలనే.. ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యం

నువ్వు వదలకుమా వదలకుమా.. సరికోరే నిజమా..

నీ మార్పే రానుంది వినవే..

నీకే నువ్వియ్యాలి విలువే..

మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్న

సంగీత దర్శకుడు, సాహిత్యకారుల సమాచారం

మునుముందే వెలుగుంది దారే ముసుగుపోతున్న

మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా

మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా

మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్న

మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా

మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్న

మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా..

‘నదివే..’ పాటను బ్యూటిఫుల్ మెలొడీగా కంపోజ్ చేసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. ప్రేయసి ప్రత్యేకతను పొగుడుతూ పొయెటిక్‌గా, రొమాంటిక్‌గా మనసుకు హత్తుకునేలా లిరిక్స్ అందించారు నటుడు, రైటర్ రాకేందు మౌళి. చిత్రీకరణ తుది దశలో ఉన్న ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

మొత్తానికి, ‘నదివే’ పాట రొమాంటిక్ మెలోడీతో ప్రేక్షకులను అలరించనుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.