|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేటి రాశి ఫలాలు (జూలై 21, 2025): తొందరపాటు నిర్ణయాలు వద్దు, శక్తి కంకణం ధరించండి

Published: 20-07-2025, 6:44 PM
నేటి రాశి ఫలాలు (జూలై 21, 2025): తొందరపాటు నిర్ణయాలు వద్దు, శక్తి కంకణం ధరించండి

జూలై 21, 2025 నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు ప్రతి రాశివారికి వేర్వేరు ఫలితాలు ఉన్నాయి. కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. శక్తి కంకణాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Key Points

1

ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి.

2

నిత్యం కంకణం ధరించి సర్వదోషాలను నివారించండి.

4

ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది.

వివిధ రాశులకు ఈ రోజు ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : సోమవారం, తిథి : కృ. ఏకాదశి, నక్షత్రం : రోహిణి

కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. నిత్యం సర్పదోష నివారణ కంకణం ధరించడం వలన సర్వదోషాలు తొలగిపోతాయి. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీద మీరు చేసుకుపోవడం వలన సానుకూల ఫలితాలను సాధిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

వృషభ రాశి వారు అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగుతారు. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న మీవారిని రక్షించవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఆర్థికంగా పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతవరకు ఊరటను చెందుతారు. కాలం అనుకూలంగా మారుతున్నట్లుగా భావిస్తారు. నిత్యం దీపారాధన కుందిలో రెండు చుక్కలు పరిశులు గంధం వేయండి.

మిథున రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ నిజాయితీని ఋజువు చేసుకోగలుగుతారు. పరోపకార బుద్ధిని కలిగి ఉంటారు. నిత్యం నాగబంధాన్ని ఉపయోగించండి. వ్యాపారపరంగా లాభాలు రౌటీషన్ల రూపంలో ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.

శక్తి కంకణాల ప్రాముఖ్యత

కర్కాటక రాశి వారికి భూవివాదాలు తీరి, నూతన ఒప్పందాలు కుదురుతాయి. నూతన ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిత్యం యంభస్మాన్ని ధరించడం వలన యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. రాజకీయమైన వ్యూహాలు అంతగా లాభించవు.

సింహ రాశి వారు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలలో సీటు లభించడం కష్టం అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనప్పుడు చికాకులు పెడతాయి. అస్తి వివాదాలు తీరి, నూతన ఒప్పందాలు కుదురుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. ప్రతిరోజూ యోగా, సూర్యనమస్కారాలు చేయండి. నిత్యం జువ్వాధితో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

కన్య రాశి వారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. నిత్యం ఐశ్వర్యనాగినిని ఉపయోగించడం వలన లక్ష్మి కటాక్షం లభిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. నిత్యం దీపారాధన కుందిలో రెండు చుక్కలు వేయడం వలన అన్ని విధాలా మంచిది. రుణాలు తీరుతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కోర్టు కేసుల నుండి విముక్తి పొందుతారు. ప్రముఖుల నుండి వచ్చిన వార్త వలన కొంత సంతోషం కలుగుతుంది. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి.

వృశ్చిక రాశి రాజకీయ, కళారంగాలలో ఉన్న వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మిత్రులు సైతం శత్రువులుగా మారి సమస్యలు సృష్టించవచ్చు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. నిత్యం నాగబంధాన్ని ఉపయోగించడం వలన మేలు జరుగుతుంది.

ఆర్థిక, వృత్తిపరమైన సూచనలు

ధనస్సు రాశి ఉద్యోగాలలో స్థానచలనముంటుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. నిత్యం దైవ కార్యక్రమాలలో ప్రథమ తాంబూలం వాడండి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు.

రాజకీయ, కళారంగాలలో ఉన్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం అయినప్పటికీ చివరకు పూర్తి చేస్తారు. ఋణాలు తీర్చుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ చాలా అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెట్టుబడుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిత్యం శక్తికంకణం ధరించండి.

కుంభ రాశి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లాభం పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నిత్యం సౌరకంకణం ధరించండి.

మీన రాశి వారి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాలలో ఉన్న వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000

ఈ రోజు రాశిఫలాలను పరిగణనలోకి తీసుకొని, మీ నిర్ణయాలలో జాగ్రత్త వహించండి. శక్తి కంకణం ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. దేవతలను ఆరాధించడం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.