|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాజీ భార్య సమంతతో నాగచైతన్య? శోభితతో కలిసి మరీ.. నిజం తెలిస్తే షాక్!

Published: 22-12-2025, 2:44 AM
మాజీ భార్య సమంతతో నాగచైతన్య? శోభితతో కలిసి మరీ.. నిజం తెలిస్తే షాక్!
  • నాగచైతన్య మాజీ భార్య సమంతను కలవలేదు, అది శోభిత చెల్లెలు సమంత.
  • శోభిత ధూళిపాలా చెల్లెలు సమంత ఇంట్లో నాగచైతన్య దంపతులు సందడి చేశారు.
  • ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లలో గందరగోళం నెలకొంది.
  • నాగచైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

నాగచైతన్య, శోభిత ధూళిపాలా దంపతులు ఒక పెళ్లి వేడుకలో కనిపించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ‘సమంత’ ఉండటంతో మాజీ భార్య సమంతతో నాగచైతన్య మళ్ళీ కలిశాడా అనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయంపై అసలు నిజం ఏమిటంటే…

నాగచైతన్య, సమంతల విడాకులు, కొత్త జీవితం

Akkineni Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య.. నాగార్జున నట వారసుడిగా జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చైతన్య ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ విజయాలను దక్కించుకున్నాడు. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే ఆ పెళ్లి నాలుగేళ్లు కూడా నిలవకముందే విడాకులు తీసుకుని విడిపోయారు విడాకుల తర్వాత ఇప్పటివరకు సమంత చైతన్య ఇద్దరు ఎదురెదురు పడలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

విడాకుల తర్వాత చైతన్య సమంత గురించి పాజిటివ్ గాని మాట్లాడుతూ వచ్చాడు. కానీ, సామ్  మాత్రం తన మాజీ భర్త గురించి నెగిటివ్ గా చెబుతూ వచ్చింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే వీరిద్దరూ ప్రస్తుతం వారి కొత్త జీవితాలను ప్రారంభించారు. చైతన్య, శోభిత ధూళిపాలను వివాహం చేసుకోగా.. ఈ ఏడాది సమంత.. రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక తాజాగా నాగచైతన్య తన అత్తవారింట్లో సందడి చేశాడు. శోభిత చెల్లి పేరు కూడా సమంతనే అన్న విషయం అందరికీ తెలిసిందే.

వైరల్ అయిన ఫోటో.. అసలు విషయం ఏమిటి?

శోభిత కన్నా ముందే సమంతకు వివాహం జరిగింది. తాజాగా నాగచైతన్య దంపతులు సమంత ఇంట్లో సందడి చేశారు. మరదల్ని కలవడానికి చాలా కాలం తర్వాత చైతన్య వారింటికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక అక్క బావలతో దిగిన ఫోటోను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.  ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. సడన్ గా సమంత- శోభిత మధ్యలో నాగచైతన్య అని నెటిజెన్స్ కామెంట్స్ పెట్టడంతో చాలామంది అదేంటి సమంతను మళ్ళీ నాగచైతన్య ఎందుకు కలిశాడు.. ఏఐ అయ్యి ఉంటుంది అనుకున్నారు.

చైతన్య కెరీర్: తండేల్ నుండి వృషకర్మ వరకు

అయితే సమంత అంటే చై మాజీ భార్య కాదు మరదలు అని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య కెరీర్  విషయానికొస్తే తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ హీరో తాజాగా వృషకర్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  మరి ఈ సినిమాతో చైతన్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మాజీ భార్య సమంతతో నాగచైతన్య కలిశాడని జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని ఈ సంఘటన స్పష్టం చేసింది. శోభిత చెల్లెలు సమంతతో కలిసి దిగిన ఫోటో మాత్రమే అది. ప్రస్తుతం చైతన్య కెరీర్‌లో బిజీగా ఉన్నాడు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.