
📌 Key Points
- తండేల్ తర్వాత నాగ చైతన్య ‘వృషకర్మ’ మూవీతో రాబోతున్నాడు – ట్రెజర్ హంట్ పాత్రలో చైతూ!
- కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం – గ్లింప్స్ వీడియో విడుదల చేసిన మూవీ యూనిట్!
- మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం – చైతూ కెరీర్‌కు సరికొత్త టర్నింగ్ పాయింట్!
- లార్జర్ దేన్ లైఫ్ స్టోరీతో వస్తున్న చైతూ – త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి!
నాగ చైతన్య తన తదుపరి చిత్రం ‘వృషకర్మ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చైతూ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
వృషకర్మతో నాగ చైతన్య సరికొత్త అవతారం!
నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వృషకర్మ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను ఈరోజు విడుదల చేశారు. ఈ వీడియో విడుదల సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఓ చిన్నపాటి ఈవెంట్ను నిర్వహించారు. దానికి నాగచైతన్య, కార్తీక్ దండు మరి కొంతమంది ఈ మూవీ బృందం వారు హాజరయ్యారు. ఈ మూవీ యూనిట్ తాజాగా పాత్రికేయులతో ముచ్చటించింది.
కార్తీక్ దండు దర్శకత్వంలో ట్రెజర్ హంట్ స్టోరీ!
అందులో భాగంగా ‘నాగచైతన్య’కి మీరు సినిమా కథలను అంత ఈజీగా ఓకే చేయరు అని బయట టాక్ ఉంది. తండల్ తర్వాత కూడా మీరు అనేక స్టోరీలను విన్నట్లు తెలిసింది. మరి వృషకర్మ ఓకే చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురయింది. దానికి నాగ చైతన్య … నేను ఒక సినిమా ఓకే చేయడానికి అనేక డౌట్లు అడుగుతాను. అందుకు కారణం నేను సినిమా కథ విషయంలో పక్కాగా ఉంటే దానిపై ఫుల్ ఫోకస్ పెట్టగలను, అందుకే సందేహాలను ముందే తీర్చేసుకుంటాను.
లార్జర్ దేన్ లైఫ్ స్టోరీతో చైతూ మాస్ ఎంట్రీ!
ఈ స్టోరీని ఓకే చేయడానికి ప్రధాన కారణం కార్తీక్ దండు సినిమా కథ చెప్పిన విధానం. నాకు ఎప్పటినుండో లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ చేయాలి అని కోరిక, అలాంటి కథను కార్తీక్ నాకు వినిపించాడు. ఈ సినిమాలో నేను ట్రెజర్ హంట్ పర్సన్ గా కనిపిస్తాను, ఆ పాత్ర నాకు చాలా నచ్చింది, అందుకే ఈ సినిమాను ఓకే చేశాను. ఇంకా కొన్ని విషయాలు చెప్పవచ్చు కానీ చెబితే స్టోరీ లీక్ అవుతుంది, కాబట్టి చెప్పడం లేదు అని నాగ చైతన్య సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది.
నాగ చైతన్య వృషకర్మ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమా చైతూ కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


