|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామాయణంలో కాజల్ అగర్వాల్.. మండోదరిగా టాలీవుడ్ చందమామ! ఫ్యాన్స్ షాక్!

Published: 02-04-2026, 10:05 AM
రామాయణంలో కాజల్ అగర్వాల్.. మండోదరిగా టాలీవుడ్ చందమామ! ఫ్యాన్స్ షాక్!
  • కాజల్ అగర్వాల్ ‘రామాయణం’లో మండోదరిగా మెస్మరైజ్ చేయనుంది – ఇది నిజంగా ఒక సంచలనమే!
  • రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తుండటం ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణ కానుంది.
  • నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ దృశ్యకావ్యం మొదటి భాగం దీపావళికి విడుదల కానుంది.
  • భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధం!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఆమె ‘రామాయణం’లో మండోదరి పాత్రలో కనిపించనుంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రామాయణంలో కాజల్ అగర్వాల్ సంచలనం

పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టుతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల ‘భగవంత్ కేసరి’, ‘కన్నప్ప’ వంటి చిత్రాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రామాయణ’ చిత్రంలో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక గాథలో కాజల్ కీలక పాత్ర పోషిస్తోంది. గత కొంద్దికాలంగా ఈ సినిమాలో కాజల్ రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనుందని వార్తలు రాగా, తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆ వార్తలను నిజం చేసింది. రామాయణ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ.. “ప్రతి తరం శ్రీరాముడి పేరుతోనే పెరిగారు. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం మర్యాద పురుషోత్తముడైన ఆ రాముడిని దర్శించుకోబోతోంది. ఇలాంటి ఒక గొప్ప దృశ్యకావ్యంలో నేను కూడా భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను” అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

రణ్‌బీర్, సాయి పల్లవితో కాజల్ స్క్రీన్ షేరింగ్

అయితే, కాజల్‌ను సీత పాత్రలో చూడాలనుకున్న అభిమానులు, ఆమె మండోదరిగా నటిస్తుండటంతో కొంత నిరాశ వ్యక్తం చేసినా, ఆమె నటనపై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చందమామ కాజల్ ఈ క్రేజీ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దీపావళికి విడుదల: భారీ అంచనాలు!

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

కాజల్ అగర్వాల్ రామాయణంలో భాగం కావడం టాలీవుడ్‌లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.