
📌 Key Points
- నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల గుజరాత్‌లోని పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు.
- తెల్ల చొక్కా, పంచెలో నాగచైతన్య, ఎర్ర చీరలో శోభిత ఆకర్షణీయంగా కనిపించారు.
- నాగచైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తున్నారు, కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
- శోభిత కూడా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల గుజరాత్‌లోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. వీరిద్దరూ కలిసి దైవ దర్శనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూరీ జగన్నాథ్ ఆలయంలో నాగచైతన్య, శోభిత సందడి
Naga Chaithanya – Sobhitha : టాలీవుడ్ క్రేజీ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.. ఒకవైపు వరుసగా హిట్ సినిమాలలో నటిస్తున్న ఈయన ప్రస్తుతం బ్యాడ్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ను డిఫరెంట్ స్టోరీలతో వస్తున్నాయి. గతంలో వచ్చిన తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో నాగచైతన్య. ఇదిలో ఉండగా ఆయన తన భార్యతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు.. తాజాగా నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఓ టెంపుల్ లో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎక్కడ ప్రత్యక్షమయ్యారు అన్నది మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ జంట నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ళ ఇద్దరు కూడా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ దైవచింతనలో మునిగిపోయారు.. ఈమధ్య వీరిద్దరూ కూడా సినిమాలకు సమయం దొరికితే చాలు గుడులు గోపురాలు అంటూ తిరుగుతున్నారు.. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట కెమెరాలకు చిక్కుతూనే ఉన్నారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయి.. తాజాగా వీరిద్దరూ కలిసి గుజరాత్ లోని ప్రముఖ పూరి జగన్నాథుని ఆలయాన్ని సందర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. తెల్ల చొక్కా పంచలో నాగచైతన్య కనిపించగా, ఎర్రని చీరలో శోభిత అందంగా కనిపిస్తుంది. అక్కడ దేవుడిని దర్శించుకున్నారు. వీరిద్దరికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఆ వీడియోను ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
వైరల్ అవుతున్న చైతూ, శోభితల వీడియో
గత ఏడాది నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తాజాగా ఈయన వృషకర్మ అనే సినిమాలో నటిస్తున్నాడు.. వృషకర్మ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో చైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. అలాగే ఇందులో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.. అటు శోభిత కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. బాలీవుడ్ లో ఈమె చేస్తున్న సినిమాలు మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నాయి.. ప్రస్తుతం వీరిద్దరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. ఇక నాగచైతన్య వచ్చేయడాది మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టారు.. సోషల్ మీడియాలో మాత్రం శోభిత తల్లి కాబోతోంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది.
నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ అప్డేట్స్
Yuvasamrat #NagaChaitanya along with #SobhitaDhulipala visited the sacred Shree Puri Jagannath Temple in Orissa and had a blessed darshan. 🙏 @Chay_akkineni #Sobhita #Vrushakarma pic.twitter.com/vJvijMmJSv
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) March 6, 2026
మొత్తానికి నాగచైతన్య, శోభితల గుడి సందర్శన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వారిద్దరూ కలిసి కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


