|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగవంశీ అదిరిపోయే సర్ ప్రైజ్: మ్యాజిక్ చేయనున్న బ్లాక్ బస్టర్ కాంబో!

Published: 30-12-2025, 2:30 AM
నాగవంశీ అదిరిపోయే సర్ ప్రైజ్: మ్యాజిక్ చేయనున్న బ్లాక్ బస్టర్ కాంబో!
  • స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో మరో సినిమాను ప్రకటించిన నిర్మాత నాగవంశీ.
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం-40గా ఈ చిత్రం తెరకెక్కనుంది.
  • స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వంలో గ్రామీణ నేపథ్య యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.
  • ‘బడాస్’ సినిమా కంటే ముందే ఈ కొత్త చిత్రం రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్.

సిద్ధు జొన్నలగడ్డ అభిమానులకు నిర్మాత నాగవంశీ అదిరిపోయే శుభవార్త అందించారు. ‘బడాస్’ తర్వాత సిద్ధుతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రకటించారు. ఈ గ్రామీణ నేపథ్య యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వం వహించనున్నారు. ‘బడాస్’ కంటే ముందే ఈ సినిమా రిలీజ్ కానుండటం విశేషం.

నాగవంశీ షాకింగ్ ప్రకటన: సిద్ధుతో మరో క్రేజీ ప్రాజెక్ట్!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) రీసెంట్‌గా ‘తెలుసు కదా’(Telusu Kadaa) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ అతను నటిస్తున్న సినిమా ‘బడాస్’(Badass). దీనికి రవికాంత్ పెరెపు(Ravikanth Perepu) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ(Naga Vamshi) ఫ్యాన్స్‌కు మరో కిక్కిచ్చే న్యూస్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

‘బడాస్’ ముందే సిద్ధు కొత్త సినిమా: పూర్తి వివరాలు!

ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘బడాస్ రాకముందే.. కొంచెం సరదాగా గడుపుదాం. మరో క్రేజీ ఎంటర్‌టైనర్‌తో తిరిగి వస్తున్నాను.. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం-40తో ఓ సినిమా తెరకెక్కనుంది’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పోస్టర్‌ను గమనించినట్లయితే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రెండు సినిమాలు!

ఇక ఈ చిత్రానికి స్వరూప్ ఆర్ఎస్‌జే(Swaroop RSJ) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా బడాస్ మూవీ కంటే ముందే రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. కాగా స్టార్ బాయ్ చేస్తున్న రెండు సినిమాలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనుండంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొన్నది.

‘బడాస్’ రిలీజ్‌కు ముందే సిద్ధు మరో సినిమాను ప్రకటించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వరుసగా రెండు చిత్రాలతో సిద్ధు అలరించనున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్ మరిన్ని విశేషాల కోసం వేచి చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.