|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్యాంగ్ లీడర్ మూవీలో హీరోగా నాగబాబు ఫస్ట్ ఛాయిస్ – చిరంజీవి ట్విస్ట్ తో…

Published: 10-05-2025, 1:47 PM
గ్యాంగ్ లీడర్ మూవీలో హీరోగా నాగబాబు ఫస్ట్ ఛాయిస్ - చిరంజీవి ట్విస్ట్ తో...

మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్. కానీ ఈ సినిమాలో మొదట నాగబాబును హీరోగా ఎంపిక చేశారని తెలుసా? చిరంజీవి ఎలా ఈ సినిమాలో నటించారు అనేది ఈ కథనంలో చూద్దాం.

Key Points

1

చిరంజీవి కాదు, నాగబాబును గ్యాంగ్ లీడర్ గా మొదట ఎంపిక చేశారు.

2

చిరంజీవి కథ విని సినిమా చేయడానికి ముందుకు వచ్చారు.

4

సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

నాగబాబు ఫస్ట్ ఛాయిస్

మెగాస్టార్ చిరంజీవిని తిరుగులేని మాస్ హీరోగా నిల‌బెట్టిన సినిమాల్లో గ్యాంగ్‌లీడ‌ర్ ఒక‌టి. 1991లో రిలీజైన ఈ యాక్ష‌న్ క్రైమ్ మూవీ అప్ప‌టివ‌ర‌కు ఉన్న బాక్సాఫీస్ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టింది. హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు మూవీగా నిలిచింది.

చిరంజీవి డైలాగ్స్‌, మ్యాన‌రిజ‌మ్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో థియేట‌ర్లు మొత్తం షేక్ అయ్యాయి. ఈ సినిమాలో చేయి చూశావా ఎంత ర‌ఫ్‌గా ఉందో…ర‌ఫ్పాడించేస్తాను…ఓ సారి ఫేస్ ట‌ర్నింగ్ ఇచ్చుకో అంటూ చిరంజీవి చెప్పిన మాస్ డైలాగ్స్ యూత్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. మ్యూజిక‌ల్‌గా గ్యాంగ్ లీడ‌ర్ మూవీ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. గ్యాంగ్ లీడ‌ర్ మూవీని ఆజ్ కా గుండారాజ్ పేరుతో బాలీవుడ్‌లోకి రీమేక్ చేశారు చిరంజీవి. అక్క‌డ కూడా ఈ మూవీ సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

చిరంజీవి ఎంట్రీ

ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో హీరోగా చిరంజీవి ఫ‌స్ట్ ఛాయిస్ కాద‌ట‌. ఈ సినిమాను నాగ‌బాబుతో తీయాల‌ని డైరెక్ట‌ర్ విజ‌య బాపినీడు అనుకున్నార‌ట. బాలీవుడ్ క‌ల్ట్ క్లాసిక్‌ మూవీ షోలేలోని పాపుల‌ర్ డైలాగ్ ఆరే ఓ సాంబ టైటిల్‌గా ఫిక్స్ చేశార‌ట‌. షూటింగ్ మొద‌లుపెట్టే టైమ్‌లో చిరంజీవి క‌థ విని తానే ఈ సినిమా చేస్తాన‌ని ముందుకు వ‌చ్చార‌ట‌.

దాంతో చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా క‌థ‌లో చాలా మార్పులు చేర్పులు చేశార‌ట డైరెక్ట‌ర్ విజ‌య బాపినీడు. చివ‌ర‌కు చిరంజీవి కోస‌మే ఈ సినిమా టైటిల్‌ను కూడా గ్యాంగ్ లీడ‌ర్‌గా మార్చేశారు. అలా నాగ‌బాబు చేయాల్సిన గ్యాంగ్‌లీడ‌ర్ మూవీ చిరంజీవి హీరోగా తెర‌కెక్కింది. ఈ విష‌యాన్ని ఓ పాత ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా డైరెక్ట‌ర్ విజ‌య బాపినీడు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

సినిమా సక్సెస్

గ్యాంగ్ లీడ‌ర్ మూవీలో విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించింది. ముర‌ళీమోహ‌న్‌, శ‌ర‌త్‌కుమార్‌, సుమల‌త కీల‌క పాత్ర‌లు పోషించారు. రావుగోపాల‌రావు విల‌న్‌గా క‌నిపించాడు.

గ్యాంగ్ లీడ‌ర్ స‌క్సెస్ మీట్‌ను ఒకే రోజు నాలుగు న‌గ‌రాల్లో జ‌రిపారు. హైద‌రాబాద్‌తో పాటు తిరుప‌తి, ఏలూరు, విజ‌య‌వాడ‌ల‌లో జ‌రిగిన ఈ ఈవెంట్‌కు చిరంజీవి హెలికాప్ట‌ర్‌లో అటెండ్ కావ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా మారింది. 31 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ మూవీ అప్ప‌ట్లోనే 10 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

చివరకు చిరంజీవి హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా, బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. నాగబాబుకు బదులు చిరంజీవి నటించడం వల్ల సినిమాకు వచ్చిన మార్పులు చూడదగ్గవి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.