|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లడ్డూ కల్తీ మంటలు: రంగంలోకి నాగబాబు… వైసీపీకి షాక్!

Published: 07-02-2026, 3:05 AM
లడ్డూ కల్తీ మంటలు: రంగంలోకి నాగబాబు... వైసీపీకి షాక్!
  • తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైకాపాపై నాగబాబు ఫైర్!
  • వైసీపీ హయాంలోనే నిబంధనలు మార్పు, అందుకే కల్తీ జరిగిందన్న నాగబాబు.
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన జనసేన నేత.
  • అంబటి రాంబాబు, జోగి రమేష్‌పై టీడీపీ శ్రేణుల దాడి… ఉద్రిక్త పరిస్థితులు!

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చదవండి.

వైసీపీపై నాగబాబు సీరియస్ కామెంట్స్!

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం(Tirumala laddu ghee adulteration case) ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కూటమి, వైసీపీ నేతలు ఎవరికి వాళ్లు ఫేవరెబుల్‌గా చెప్పుకుంటున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని, ఆనాడు చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆరోపించారు. నెయ్యి కల్తీ జరిగిందని, వైసీపీ హయాంలో తప్పు జరిగిందని, అటు సిట్ కూడా ఇవే నివేదిక కోర్టుకు సమర్పించిందని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ మాటలయుద్ధం కాస్త ఇళ్లపై దాడులు వరకూ వెళ్లింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగ రమేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడిపై బూతులు సైతం మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు.. అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన నివాసంపై దాడుల చేశారు. అటు జోగి రమేశ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన ఇంటిపైనా దాడి జరిగింది.

లడ్డూ కల్తీ వెనుక అసలు నిజాలు?

దీంతో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింతగా విమర్శలు కొనసాగుతోంది. తిరుమల లడ్డూలో జంవుతుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ఆ ఆరోపణలను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి విమర్శల బాణాన్ని వరుసగా విసురుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు సైతం అదే స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు గట్టిగా వాదిస్తోంది. అప్పుడు ఎన్డీడీబీ ఇచ్చిన నివేదకపై సీఎం, డిప్యూటీ మాట్లాడారని, కానీ కల్తీ జరిగిందని వాస్తవమేనని అంటున్నారు. కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తోంది.

టీడీపీ శ్రేణుల దాడి… టెన్షన్ వాతావరణం!

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ జనసేన ఎమ్మెల్సీ, నాగబాబు(Janasena MLC Nagababu) సైతం అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పు చేశారని వ్యాఖ్యానించారు. నిబంధనలు మార్చడం తప్పేనని, అందువల్లే కల్తీ జరిగిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసీపీ తప్పులు చేసిందన్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ప్రకారమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని నాగబాబు తెలిపారు.

ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. నాగబాబు వ్యాఖ్యలతో మరింత వేడి రాజుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. అప్పటి వరకు సెలవు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.