|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లాల్ సింగ్ ఎఫెక్ట్: బాలీవుడ్ కు నాగచైతన్య గుడ్ బై చెప్పేశారా? అసలు నిజం ఇదే!

Published: 30-03-2026, 10:35 AM
లాల్ సింగ్ ఎఫెక్ట్: బాలీవుడ్ కు నాగచైతన్య గుడ్ బై చెప్పేశారా? అసలు నిజం ఇదే!
  • బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించిన నాగచైతన్య.
  • లాల్ సింగ్ చద్దా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ కు దూరం.
  • తెలుగులో వరుస అవకాశాలు ఉండటంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టలేదన్న చైతు.
  • ప్రస్తుతం వృషకర్మ సినిమాలో నటిస్తున్న నాగచైతన్య.

అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. లాల్ సింగ్ చద్దా సినిమా ఫలితం ప్రభావం చూపిందా లేదా అనే దానిపై ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు.

బాలీవుడ్ కు దూరంగా నాగచైతన్య: కారణం ఇదేనా?

Nagachaitanya: అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న వారిలో నటుడు నాగచైతన్య(Nagachaitanya) ఒకరు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నాగచైతన్య కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ (Aamirkhan)తో కలిసి లాల్ సింగ్ చద్దా(Laal Singh Chaddha) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే .ఈ సినిమా2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలోనే నాగచైతన్య తదుపరి బాలీవుడ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. బాలీవుడ్ సినిమాలకు ఈయన దూరం అవ్వడానికి గల కారణం ఏంటి అంటూ అభిమానుల సందేహాలను వ్యక్తం చేశారు. బహుశా మొదటి సినిమానే అక్కడ డిజాస్టర్ గా మారడంతో తదుపరి సినిమాలలో అవకాశం రాలేదని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తదుపరి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకు సినిమాలు చేయలేదనే విషయంపై తాజాగా నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు.

తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న చైతు

ఈ విషయం గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. తాను తిరిగి బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం అంటూ ఏమీ లేదని తెలిపారు. ప్రస్తుతం తనకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలోనే తెలుగు సినిమాలలో బిజీగా ఉన్నానని అందుకే బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టలేదని తెలిపారు. లాల్ సింగ్ చద్దా కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వెనకడుగు వేయలేదని ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తే తప్పకుండా బాలీవుడ్ సినిమాలలో నటిస్తాను అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడం గురించి క్లారిటీ ఇచ్చారు.

అంచనాలు పెంచిన వృషకర్మ గ్లింప్స్..

వృషకర్మ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ

ఇక ప్రస్తుతం నాగచైతన్య తెలుగు సినిమాల విషయానికి వస్తే ఇటీవల చందు మొండేటి దర్శకత్వంలో ఈయన తండేల్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు .ప్రస్తుతం ఈయన కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వృషకర్మ(Vrusha karma) అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కెరియర్లో ఇది మొట్టమొదటి పని ఇండియా సినిమా కావటం విశేషం. మైథాలాజికల్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ల నటిస్తున్నారు ఈ సినిమా జూన్ లేదా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

నాగచైతన్య బాలీవుడ్ కు గ్యాప్ ఇవ్వడానికి గల కారణాలను వివరించారు. తెలుగులో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా బాలీవుడ్ లో నటిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.