|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కినేని అభిమానులకు పండగే! వృషకర్మ సీక్వెల్ పై చైతు సంచలన ప్రకటన!

Published: 16-03-2026, 5:35 AM
అక్కినేని అభిమానులకు పండగే! వృషకర్మ సీక్వెల్ పై చైతు సంచలన ప్రకటన!
  • నాగచైతన్య నటించిన వృషకర్మ సినిమా జూన్ లేదా జూలైలో విడుదల కానుంది.
  • ఇది నాగచైతన్య కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమా.
  • ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.
  • సినిమా సక్సెస్ అయితే సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది అని చైతన్య తెలిపారు.

నాగచైతన్య, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వస్తున్న సినిమా వృషకర్మ. ఈ సినిమా జూన్ లేదా జూలైలో విడుదల కానుంది. ఇది చైతన్య కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. సీక్వెల్ గురించి చైతన్య ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

వృషకర్మ సినిమా విడుదల ఎప్పుడు?

Vrushakarma movie: అక్కినేని నటుడు నాగచైతన్య(Nagachaitanya) ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. వృషకర్మ (Vrushakarma)అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయయని సమాచారం. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ లేదా జూలై నెలలో విడుదల కాబోతుందని తెలుస్తోంది. నాగచైతన్య సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్, మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా వృషకర్మ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్యకు వృషకర్మ సినిమా గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నాగచైతన్య వృషకర్మ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను వ్యక్తిగతంగా ఫిట్ నెస్ గా ఉండటానికి ఇష్టపడతాను అయితే ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో నా బాడీ చూపించే అవకాశం ఎక్కడ రాలేదు. వృషకర్మ సినిమాలో నా పాత్ర ట్రెజర్ హంటర్ పాత్ర కావడంతో నా ఫిట్ నెస్ ను కూడా ఆయుధంలా వాడుకుంటున్నానని నాగచైతన్య తెలిపారు.

పాన్ ఇండియా మూవీగా వృషకర్మ

ఇటీవల ఈయన జిమ్ లో పెద్ద ఎత్తున వర్క్ అవుట్ చేస్తూ ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పట్ల కూడా నాగచైతన్యకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ వృషకర్మ సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది పూర్తిగా ఈ సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకుంటే కచ్చితంగా సీక్వెల్ వస్తుందని ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పకనే చెప్పేశారు.

దక్ష పాత్రలో మీనాక్షి చౌదరి…

సీక్వెల్ ఉంటుందా లేదా?

ఇప్పటివరకు నాగచైతన్య సినీ కెరియర్ లోనే ఈ తరహా జోనర్ టచ్ చేయలేదు. మొదటిసారి మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి దక్ష అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బీవీఎస్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తండేల్ తరువాత నాగచైతన్య నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నాగచైతన్యకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

నాగచైతన్య వృషకర్మ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.