
📌 Key Points
- రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాలో విలన్ పాత్రను నాగార్జున రిజెక్ట్ చేశారనే వార్తల్లో నిజం లేదని నాగార్జున స్పష్టం చేశారు.
- దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన దర్శకత్వం వహించిన ‘ఉరి’ సినిమా తన ఫేవరెట్ అని నాగార్జున తెలిపారు.
- అక్షయ్ కన్నా ‘ధురంధర్’ సినిమాలో అద్భుతంగా నటించారని, సినిమాకు ఆయన నటన హైలైట్ గా నిలిచిందని నాగార్జున కొనియాడారు.
- ‘ధురంధర్’ సినిమా సీక్వెల్ కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానని నాగార్జున తెలిపారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘ధురంధర్’ సినిమాలో విలన్ పాత్రను రిజెక్ట్ చేశారనే వార్తలపై స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ‘ధురంధర్’ సీక్వెల్ కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు.
ధురంధర్ గురించి వస్తున్న వార్తలపై నాగార్జున క్లారిటీ
Dhurandhar: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన రజనీకాంత్ కూలీ, ధనుష్ కుబేర వంటి సినిమాలలో క్యామియో పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే నాగార్జునకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. ఇటీవల బాలీవుడ్ నటుడు రణవీర్(Ranveer) ప్రధాన పాత్రలో ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ధురంధర్(Dhurandhar). ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాలో రణవీర్ సింగ్ ను ఢీకొడుతూ ప్రముఖ నటుడు అక్షయ్ కన్నా(akshaye khanna) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించారు. అయితే అక్షయ్ కన్నా పాత్రలో ముందుగా టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించాల్సి ఉందని ఆయన కొన్ని కారణాలవల్ల ఈ సినిమా రిజెక్ట్ చేయడంతోనే అక్షయ్ కన్నా ఈ సినిమాలో భాగమయ్యారు అంటూ వార్తలు రావడంతో ఈ విషయం తెలిసిన నాగార్జున అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇలాంటి అద్భుతమైన పాత్రను నాగార్జున రిజెక్ట్ చేసి తప్పు చేశారా? చేసి ఉంటే బాగుండేది అంటూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.
అక్షయ్ కన్నా నటనపై నాగార్జున ప్రశంసలు
ఈ విధంగా నాగార్జున ధురంధర్ సినిమాని రిజెక్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తాను ధురంధర్ సినిమాలో విలన్ పాత్రను మిస్ చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు. ఈ పాత్రలో చేయడం కోసం ఎవరు నన్ను సంప్రదించలేదని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఇలా నాగార్జున ఈ వార్తలపై స్పందించడంతో పూర్తిగా ఈ వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. ఇక ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ…ధురంధర్ ఒక అద్భుతమైన చిత్రమని ఈ సినిమాకు అక్షయ్ కన్నా నటన హైలెట్ గా నిలిచిందని తెలిపారు.
ధురంధర్ సీక్వెల్ కోసం వెయిటింగ్..
దర్శకుడు ఆదిత్యధర్ పై నాగార్జున కామెంట్స్
ఇక దర్శకుడు ఆదిత్యధర్ గురించి మాట్లాడుతూ ఆయన టేకింగ్ తనకు చాలా నచ్చుతుందని తెలిపారు. అలాగే ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఉరి సినిమా తన ఫేవరెట్ అంటూ నాగార్జున తెలియజేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తాను రాబోయే సీక్వెల్ సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నాగార్జున ఈ సందర్భంగా ధురంధర్ సినిమా గురించి వస్తున్నటువంటి వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం తన 100వ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ పనులను చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా ఈ ఏడాది దసరా పండుగకు విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం.
‘ధురంధర్’ సినిమా గురించి వస్తున్న వార్తలకు నాగార్జున తన స్పందనతో చెక్ పెట్టారు. సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పడం సినిమాపై ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తుంది.


