|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nagarjuna : 65 ఏళ్ళ వయసులోనూ మన్మథుడిగా ఉండటానికి ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. చెప్పేసిన నాగ్.. మీరు కూడా ట్రై చేయండి..

Published: 05-08-2025, 10:14 PM
Nagarjuna : 65 ఏళ్ళ వయసులోనూ మన్మథుడిగా ఉండటానికి ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. చెప్పేసిన నాగ్.. మీరు కూడా ట్రై చేయండి..

టాలీవుడ్ స్టార్ నాగార్జున తన 65వ ఏట కూడా అద్భుతమైన ఫిట్నెస్‌ను కలిగి ఉన్నారు. ఆయన ఈ అద్భుత ఫిట్నెస్‌కు వెనుక ఉన్న రహస్యాలను ఇక్కడ తెలుసుకుందాం.

Key Points

నాగార్జున ఫిట్నెస్ రొటీన్

Nagarjuna : టాలీవుడ్ లో 65 ఏళ్ళు వచ్చినా ఇంకా మన్మధుడిలా కనిపిస్తూ ఏమున్నాడ్రా బాబు అనిపించేలా ఉండే హీరో మన కింగ్ నాగార్జున. ఆయనకి వయసైపోదు అనే డైలాగ్ నాగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోద్ది. నాగార్జున త్వరలో రజినీకాంత్ కూలీ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రజినీకాంత్ నాగార్జున అందం, ఫిట్నెస్ గురించి తెగ పొగిడేశారు. దానికి సీక్రెట్ అడిగితే నాగార్జున కొన్ని చెప్పారట.

నాగార్జున చెప్పిన సీక్రెట్స్ ని రజినీ ప్రమోషన్స్ లో చెప్పేసారు. అలాగే నాగార్జున కూడా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫిట్నెస్ సీక్రెట్స్ చెప్పారు. నాగార్జున, రజినీకాంత్ కలిసి నాగ్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఏం చెప్పారో తెలుసా?

నాగార్జున అందానికి, ఫిట్నెస్ కి సీక్రెట్స్ ఇవే..

రోజూ 45 నిమిషాల నుంచి గంట వరకు కచ్చితంగా వ్యాయామం.

రోజూ ఒకే టైపు వ్యాయామం కాకుండా ఓ రోజు బరువులు ఎత్తడం, ఒక రోజు థ్రెడ్ మిల్ పై పరిగెత్తడం, ఇంకోరోజు స్విమ్మింగ్, ఒక రోజు వాకింగ్.. ఇలా అన్ని కవర్ అయ్యేలా చేయడం.

ఆహార నియమాలు మరియు అలవాట్లు

వ్యాయామం చేసేటప్పుడు ఫోన్ వాడకపోవడం, మధ్యలో బ్రేక్స్ తీసుకోకపోవడం.

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయడం. అంటే రోజులో ఏం తిన్నా 12 గంటల్లోనే తింటారు. మరో 12 గంటలు ఉపవాసమే.

ఉదయం పూట కిమ్చి, ఉడికించిన క్యాబేజి, బ్రొకోలి, కొన్ని కూరగాయ ముక్కలు, గోరువెచ్చని నీళ్లు, కాఫీ తాగుతారు.

మధ్యాహ్నం అందరిలాగేన్ భోజనం, అందులో పప్పు, కూర, పచ్చడి, నాన్ వెజ్ అన్ని ఉండేలా చూసుకుంటారు.

నిద్ర మరియు ఒత్తిడి నిర్వహణ

రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్యలో డిన్నర్‌ పూర్తి చేస్తారు. అందులో సలాడ్స్‌, చికెన్‌ లేదా ఫిష్‌ తింటారు.

అయితే నాగార్జునకు స్వీట్స్ అంటే ఇష్టం. కానీ అవి తినకూడదు. దాంతో రాత్రి పూట ఒక్కోసారి ఏదైనా స్వీట్, డిజర్ట్ తిని ఉదయం అది కరిగేంతలా వర్కౌట్స్ చేస్తారట.

రాత్రి త్వరగా పడుకోవడం. ప్రశాంతమైన నిద్ర. రాత్రి షూటింగ్స్, ఈవెంట్స్ వల్ల లేట్ అయితే తప్ప రోజూ ఒకే టైంకి పడుకుంటారు.

అలాగే తండ్రి చెప్పిన సలహా.. సెలబ్రిటీల విషయంలో అన్ని రకాలుగా ఒత్తిడి ఉంటుంది. బయట విషయాల గురించి, అక్కర్లేని విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు అనేది పాటిస్తారట. ఇలా ఇవన్నీ పాటించి నాగార్జున ఇంకా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు కూడా ఇవి పాటించి మీ హెల్త్ ని ఫిట్ చేసుకోండి.

నాగార్జున ఫిట్నెస్ మరియు ఆరోగ్య రహస్యాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన అనుసరించే పద్ధతులను పాటించడం ద్వారా, మనం కూడా ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.